తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్( Allu Arjun ) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది.ఆయన చేసిన సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాయి.
మరి ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.ఇక ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమా( Pushpa 2 movie ) రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర అల్లు అర్జున్ వచ్చినప్పుడు జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే ఆవిడ చనిపోయిన విషయం మనకు తెలిసిందే.
ఇక దానిని ఉద్దేశించి అల్లు అర్జున్ మీద కొన్ని కేసులైతే ఫైల్ అయ్యాయి.

ఇంకా దానికి తగ్గట్టుగానే ఈరోజు చిక్కడపల్లి పోలీసులు( Chikkadapally Police ) అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం జరిగింది.మరి మొత్తానికైతే అల్లు అర్జున్ మీద ఈ కేసు ఫైల్ అవ్వడానికి దాని వెనుక ఇంకేదైనా రాజకీయ కుట్ర ఉందా అనే ధోరణిలో కొన్ని కొన్ని వార్తలైతే వస్తున్నాయి…ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ లాంటి నటుడు పాన్ ఇండియాలో తన సత్తాను చాటుకుంటున్నాడు.ఇక ఇది నచ్చని కొంతమంది వారి మీద కావాలనే ఇలాంటి కొన్ని మచ్చలను ఏర్పాటు చేసి ఆయన్ని జైలుకు పంపించే పరిస్థితిలను క్రియేట్ చేస్తున్నారు అంటూ మరి కొంతమంది కామెంట్లైతే చేస్తున్నారు.

ఇక ఈ విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎలాంటి స్పందన తెలియజేయడం లేదు.ఇక సీఎం రేవంత్ రెడ్డి మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటూ సమాధానం చెప్పినప్పటికి అల్లు అర్జున్ మీద కేసు ఫైల్ చేయడానికి అలాగే దానిని అనుసరించడానికి పెద్ద ఎత్తున కుట్రయితే జరుగుతుందని అతని అభిమానులైతే ఆరోపణలు చేస్తున్నారు…ఇక ఇది ఏమైనా కూడా అల్లు అర్జున్ మళ్ళీ ఎప్పుడు బయటికి వస్తాడు అనేది మాత్రం స్పష్టం గా తెలియడం లేదు…
.