ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) అరెస్ట్ విషయం ఒక్కసారిగా అభిమానులకు మింగుడు పడని విషయంగా మారిపోయింది. పుష్ప 2 ( Pushpa 2 ) సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఈయన సక్సెస్ టూర్ వెళ్తున్నారు.
ఇలాంటి తరుణంలో ఈయనని అరెస్టు చేయడం పట్ల రెండు తెలుగు రాష్ట్రాలలో బన్నీ అభిమానులు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు.పుష్ప 2 సినిమా ప్రీమియర్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే.
అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి థియేటర్ వద్దకు వెళ్లడంతో ఆయనని చూడడం కోసం అభిమానులు ఎగబడ్డారు ఈ తరుణంలోని తొక్కిసలాట జరిగింది.
ఈ తొక్కిసలాటలో భాగంగా రేవతి ( Revathi )అనే మహిళ అభిమాని అక్కడకక్కడే మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్ర గాయాలు పాలై ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పై కేసు నమోదు కావడంతో ఎలాంటి సమాచారం లేకుండా పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి తనని అరెస్టు చేయడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది.ప్రస్తుతం ఈయనని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి అక్కడి నుంచి ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఇలా పోలీసులు ఉన్నఫలంగా తనని అరెస్టు చేయడం పట్ల అల్లు అర్జున్ తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు.తాను పోలీసులకు తప్పకుండా సహకరిస్తానని మీరు చేసే విషయంలో ఏమాత్రం తప్పులేదని అల్లు అర్జున్ తెలియజేశారు.అయితే తాను వెళ్లి డ్రెస్ మార్చుకొని వస్తానని చెప్పినప్పటికీ పోలీసులు మాత్రం అనుమతి తెలపలేదు దీంతో ఈయన మండిపడ్డారు.కనీసం డ్రెస్ కూడా మార్చుకోనివ్వరా అంటూ పోలీస్ తీరుపై మండి పడటమే కాకుండా పోలీసులు డ్రెస్ మార్చుకోవాల్సి వస్తే మేము కూడా బెడ్ రూమ్ వరకు వస్తామని చెప్పడంతో ఈయన మండిపడ్డారు.
ఇలా డ్రెస్ మార్చుకుంటానని చెప్పిన అనుమతించకపోవడం కరెక్ట్ కాదు.పైగా నా బెడ్ రూమ్ వరకు వస్తామనటం టూ మచ్ సర్ అంటూ ఈయన ఫైర్ అయ్యారు.