ముఖం చర్మం తెల్లగా యవ్వనంగా మెరిసిపోతూ కనిపించాలని కొందరు తెగ ఆరాటపడుతుంటారు.అందులో భాగంగానే రకరకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్( Skin care products ) వాడుతుంటారు.
ప్రతినెలా బ్యూటీ పార్లర్ కు వెళ్లి వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.కానీ మన అందాన్ని పెంచే ఔషధాలు మన వంటింట్లోనే ఎన్నో ఉన్నాయి.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని కనుక ఫాలో అయ్యారంటే సహజంగానే వైట్ అండ్ యూత్ ఫుల్ స్కిన్ మీ సొంతం అవుతుంది.

అందుకోసం ముందుగా మిక్సీ జార్ లో పీల్ తొలగించిన ఒక అరటిపండు( banana ), నాలుగు టేబుల్ స్పూన్ పచ్చి పాలు( raw milk ) వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి( rice flour ), వన్ టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి( Multani mitti ), వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి వేసుకోవాలి.అలాగే హాఫ్ టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ మరియు సరిపడా అరటిపండు ప్యూరీ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.వారానికి రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే మస్తు బెనిఫిట్స్ పొందుతారు.ముఖ్యంగా ఈ రెమెడీ స్కిన్ కలర్ ను ఇంప్రూవ్ చేస్తుంది.
టాన్ ను తొలగిస్తుంది.చర్మాన్ని తెల్లగా కాంతివంతంగా మారుస్తుంది.
అలాగే ఈ రెమెడీ ముడతలు, చారలు, చర్మం సాగడం వంటి వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరకుండా అడ్డుకుంటుంది.యవ్వనమైన ఆరోగ్యమైన చర్మాన్ని ప్రోత్సహిస్తుంది.
అంతేకాకుండా ఈ రెమెడీ స్కిన్ ను స్మూత్ గా మారుస్తుంది.డార్క్ స్పాట్స్ ను క్రమంగా మాయం చేస్తుంది.
ఎటువంటి మేకప్ లేకపోయినా స్కిన్ షైనీ గా కనిపించేలా కూడా చేస్తుంది.