కాలం కలిసి వస్తే పదవులు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయనిడానికి నిదర్శనంగా మారిపోతున్నారు మెగా బ్రదర్స్. ఇప్పటికే ఏపీ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేనకు( Janasena ) అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు.
ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.దీంతో పాటు పవన్ మరో సోదరుడు నాగబాబుకు( Nagababu ) ఏపీ మంత్రిగా అవకాశం ఇచ్చేందుకు చంద్రబాబు నిర్ణయించారు.
ముందుగా మంత్రి పదవి ఇచ్చి ఆ తర్వాత ఎమ్మెల్సీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.ఇది ఇలా ఉండగానే మరో మెగా బ్రదర్ మెగాస్టార్ చిరంజీవికి( Megastar Chiranjeevi ) రాజ్యసభ సభ్యత్వం దక్కబోతున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇప్పటికే కేంద్ర బిజెపి పెద్దలు పవన్ కళ్యాణ్ తో పాటు, మెగాస్టార్ చిరంజీవి కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.ఆయన సేవలను దేశవ్యాప్తంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.అయితే గతంలో కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు ఎంపికై, కేంద్ర మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించారు. ఇక రాజ్యసభ సభ్యత్వం ముగిసిన తరువాత నుంచి చిరంజీవి రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు.
అయితే మళ్లీ ఇప్పుడు చిరంజీవిని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు( Rajyasabha ) నామినేట్ చేసే ఆలోచనలో ఉందట.సామాజిక సేవ లేదా చలనచిత్ర రంగం కేటగిరీ నుంచి ఆయనను రాష్ట్రపతి కోట నుంచి రాజ్యసభకు పంపాలని బిజెపి పెద్దలు భావిస్తున్నారట.
దీనిపై త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందట .చిరంజీవిని రాజ్యసభకు నామినేట్ చేయాలంటూ పవన్ ముందుగా ప్రతిపాదించారట.ఈ విషయంలో కేంద్ర బిజెపి పెద్దలు సానుకూలంగా స్పందించారట అయితే ఎక్కడా పార్టీ ముద్ర పడకుండా రాష్ట్రపతి కోట నుంచి ఆయనను రాజ్యసభకు నామినేట్ చేయనున్నారట .వివిధ రంగాల్లో సేవలు అందించిన ప్రముఖులకు రాష్ట్రపతి కోట కింద రాజ్యసభకు నామినేట్ చేయడం ఆనవాయితీ గా వస్తోంది.సుప్రీంకోర్టు మాజీ ప్రధాని న్యాయమూర్తి రంజన్ గోగొయ్ , మాజీ అథ్లెట్ పిటి ఉష, సంగీత దర్శకుడు ఇళయరాజా, సినిమా కథ రచయిత విజయేంద్ర ప్రసాద్, సామాజిక కార్యకర్త సుధా మూర్తి ఇదేవిధంగా ఎంపికయ్యారు .ఇదే కేటగిరీలో చిరంజీవిని కూడా నామినేట్ చేయనున్నారట.