ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్(Donald Trump) విజయం సాధించడంతో త్వరలోనే ఆయన ప్రభుత్వ పగ్గాలు స్వీకరించనున్నారు.దీంతో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్(joe Biden) తన పదవీకాలంలో జరిగిన అభివృద్ధి , ఇతర కార్యక్రమాల గురించి ఒక్కొక్కటి వివరిస్తున్నారు.
ఇక అధ్యక్షుడిగా తన హయాంలో దాదాపు 1500 మంది భారతీయ అమెరికన్లకు జో బైడెన్ (Joe Biden to Indian Americans)క్షమాభిక్ష పెట్టారు.వీరిలో నలుగురు భారతీయ అమెరికన్లు కూడా ఉన్నారు.
వారు మీరా సచ్‌దేవా, బాబుభాయ్ పటేల్, కృష్ణమోతే, విక్రమ్ దత్తా(Sachdeva, Babubhai Patel, Krishnamothe, Vikram Dutta).
డిసెంబర్ 2012లో డాక్టర్ మీరా సచ్‌దేవాకు(Dr.
Meera Sachdeva to Indian Americans) 20 ఏళ్ల జైలు శిక్ష పడింది.మిస్సిస్సిప్పి క్యాన్సర్ సెంటర్‌ను చీట్ చేసినందుకు గాను దాదాపు 8.2 మిలియన్ డాలర్లను తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించింది.మీరా వయసు ప్రస్తుతం 63 ఏళ్లు.2013లో హెల్త్ కేర్ ఫ్రాడ్, మాదకద్రవ్యాల కుట్ర, ఉల్లంఘనలకు సంబంధించి దాదాపు 26 నేరారోపణలపై బాబుభాయ్ పటేల్‌కు(Babubhai patel) 17 ఏళ్ల జైలు శిక్ష పడింది.
అదే ఏడాది 54 ఏళ్ల కృష్ణ మోతే(Krishna mothe) 280 గ్రాముల క్రాక్ కొకైన్, 500 గ్రాముల కొకైన్‌ను పంపిణీ చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.విచారణ అనంతరం న్యాయస్థానం అతనికి జీవిత ఖైదు విధించింది.విక్రమ్ దత్తా(Vikram Dutta) (63).2012లో మెక్సికన్ డ్రగ్స్ సంస్థకు మిలియన్ డాలర్ల మేర నగదును లాండరింగ్ చేయడానికి తన పెర్ఫ్యూమ్ బిజినెస్‌ను వాడుకున్నందుకు గాను 235 నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం
దేశాధ్యక్షుడిగా పశ్చాత్తాపం తెలిపిన వ్యక్తులను క్షమించడం, రోజువారీ జీవితంలో తిరిగి పాల్గొనే అవకాశాన్ని పునరుద్ధరించడం వంటి చర్యలు తీసుకున్నానని జో బైడెన్(Joe Biden) ఓ ప్రకటన విడుదల చేశారు.ఈ రోజు 39 మంది వ్యక్తులకు క్షమాభిక్ష ప్రసాదించానని.అలాగే సుదీర్ఘకాలంగా జైలు శిక్ష అనుభవిస్తున్న దాదాపు 1500 మంది వ్యక్తుల శిక్షలను కూడా మారుస్తున్నట్లు బైడెన్ (Biden)తెలిపారు.వీరిలో చాలా మంది నేటి చట్టాలు, విధానాలు, అభ్యాసాల ప్రకారం అభియోగాలు మోపబడితే అలాంటి వారికి తక్కువ శిక్షలు పడతాయని అధ్యక్షుడు వెల్లడించారు.
అయితే ఇటీవలి కాలంలో ఒకే రోజున జరిగిన అతిపెద్ద క్షమాభిక్ష కార్యక్రమం ఇదేనని విశ్లేషకులు అంటున్నారు.