కరెన్సీ నోట్ల కట్టలను మంటల్లో పడేసిన యూఎస్ వ్యక్తి.. వీడియో వైరల్..

అమెరికాకు చెందిన ఫెడోర్ బల్వనోవిచ్( Fedor Balvanovich ) అనే ఓ ఇన్‌ఫ్లూయెన్సర్ ఒక పిచ్చి పని చేశాడు.అతను కట్టలకొద్దీ డాలర్ల నోట్లను( Dollars ) మంటల్లో వేసి కాల్చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 Video Viral Us Influencer Faces Backlash For Throwing Bundles Of Cash In Fire De-TeluguStop.com

ఈ వీడియో సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.ఫెడర్ బల్వనోవిచ్ తన లగ్జరియాస్ జీవితాన్ని ప్రదర్శిస్తూ తరచూ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్స్ చేస్తుంటాడు.

ప్రస్తుత వైరల్ వీడియోలో,( Viral Video ) నల్ల కోటు, టోపీ, కళ్లద్దాలు ధరించి, కట్టెలకు బదులు పెద్ద పెద్ద నోట్ల కట్టలను మంటల్లోకి విసురుతూ కనిపించాడు.

“మీకు అదనపు అదృష్టం కలగాలని కోరుకుంటున్నాను” అనే క్యాప్షన్‌తో అప్‌లోడ్ చేసిన ఈ పోస్ట్‌కు 39 వేలకు పైగా లైక్స్, 1 మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి.అయితే, ఈ చర్య చాలా మంది విమర్శలకు గురైంది.బతకడానికి కష్టపడుతున్న ప్రజలకు, ఇలాంటి విపరీతమైన సంపద ప్రదర్శనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎత్తిచూపుతూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కొందరు ఆర్థిక సహాయం కోసం వేడుకోగా, మరికొందరు డబ్బు విలువ తెలియని వ్యక్తి అని ఆరోపిస్తున్నారు.

“ఈ మనిషికి ఏమైంది? నువ్వు కాల్చేసిన డబ్బు( Burnt Cash ) నా జీవితాన్ని మార్చేసేది” అని ఒక యూజర్ రాశాడు.మరొకరు వ్యంగ్యంగా ఆ డబ్బు నకిలీదా అని ప్రశ్నిస్తూ, “అది నిజమైతే, నీకు అన్నీ మంటల్లో కాల్చేసే రోగం ఉన్నట్లే ?” అని అడిగాడు.ఆకలితో ఉన్న పిల్లలతో సహా చాలా మంది అవసరంలో ఉన్నప్పుడు అతను ఇలా ఎందుకు చేస్తాడని మరికొందరు ప్రశ్నించారు.

కొందరు ఈ పరిస్థితిని జోక్ చేశారు.ఒక యూజర్, “సోదరా, డబ్బు కాల్చకు.

ఇల్లు కట్టుకోవడానికి నాకు 5 లక్షలు కావాలి” అని వ్యాఖ్యానించాడు.మరొకరు, “కొంచెం నా మీద కూడా విసురుతావా?” అని అన్నాడు.

వీడియోలోని డబ్బు నిజమైనదా కాదా అనేది స్పష్టంగా తెలియలేదు.13 మిలియన్ల ఇన్‌స్టా ఫాలోవర్లు ఉన్న బల్వనోవిచ్, తన సంపదను ప్రదర్శించడం ద్వారా గుర్తింపు పొందాడు.మరొక వీడియోలో, అతను తన ఇంటి బయట ఇప్పటికే ఉన్న భారీ కుప్పపై డబ్బు కట్టలను దించుతూ కనిపించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube