టాలీవుడ్ హీరో మాస్ మహారాజా రవితేజ( Ravi Teja ) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.వరుసగా సినిమాలలో నటిస్తున్నప్పటికీ రవితేజ సరైన సక్సెస్ సినిమా అందుకని చాలా రోజులు అయింది.
దీంతో ఒక గత సినిమాల విషయంలో మాస్ మహారాజా అభిమానులు దారుణంగా ట్రోలింగ్స్ కూడా చేసిన విషయం తెలిసిందే.బోలెడన్ని ఆశలతో సినిమా థియేటర్లోకి వెళ్లిన అభిమానులకు ప్రతిసారి నిరాశే ఎదురవుతోంది.
అప్పుడెప్పుడో వచ్చిన క్రాక్ సినిమా తప్ప ఆ తర్వాత విడుదలైన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్లుగా నిలిచాయి.
వరుసగా ఫ్లాపులు, నిర్మాతలకు కోట్లలో నష్టాలు.ఇప్పుడు లేటెస్ట్ గా మాస్ జాతర( Mass Jathara Movie ) అనే సినిమా సితార సంస్థలో చేస్తున్నారు.ఈ సినిమాతో రచయిత భాను దర్శకుడిగా మారుతున్నారు.
అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతోంది ఈ సినిమా.అయితే సాధారణంగా ఏ హీరో అయినా, దర్శకుడు అయినా సితార సంస్థలోకి వస్తే వరుసగా సినిమాలు చేసేయడం ఆనవాయితీ.
ఇప్పుడు ఈ ఆనవాయితీ రవితేజతో కూడా కొనసాగుతోంది.సితార సంస్థలో మ్యాడ్, మ్యాడ్ 2 సినిమాలు అందించిన కళ్యాణ్ శంకర్( Kalyan Shankar ) ఒక సూపర్ హీరో కాన్సెప్ట్‌తో కూడిన లైన్‌ను ఫన్ బేస్డ్ గా తయారు చేసి రవితేజకు చెప్పారు.
అది ఆయనకు నచ్చేసింది.మాస్ జాతర తర్వాత సినిమాగా అదే తెరకెక్కబోతోంది.
సూపర్ హీరో క్యారెక్టర్ ను తీసుకుని ఎంటర్‌టైన్‌మెంట్ వేలో కథ చెప్పే ప్రయత్నం చేయనున్నారు.కళ్యాణ్ చేస్తున్న మ్యాడ్ 2 మార్చి నెలాఖరులో విడుదలకు రెడీ అవుతోంది.మ్యాడ్ వన్ మంచి హిట్ కావడంతో మ్యాడ్ 2 మీద మంచి అంచనాలు ఉన్నాయి.అయితే ఈసారి రవితేజ ఖాతాలో బ్లాక్ బస్టర్ పక్కా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
మరి ఈ సినిమాతో అయినా రవితేజ సరైన హిట్ ను అందుకుంటారేమో చూడాలి మరి.సినిమా హిట్ అయితే రవితేజ ఖాతాలో మరికొన్ని సినిమాలు యాడ్ కావడం పక్కా అని చెప్పవచ్చు.