చాలామంది ఆడవారు సూపర్ లాంగ్ మరియు షైనీ హెయిర్(Hair) ను కోరుకుంటారు.అటువంటి జుట్టును పొందడానికి రకరకాల హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు.
అయితే మార్కెట్లో లభ్యమయ్యే ఉత్పత్తుల వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే.ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ సీరం(Natural serum) మాత్రం మీ జుట్టు ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతుంది.
జుట్టు ఎదుగుదలలో అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఇంతకీ ఆ హెయిర్ సీరం ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ బాయిల్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ మెంతులు(Fenugreek Seeds), రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు(Flax Seeds), వన్ టేబుల్ స్పూన్ బియ్యం(Rice ) వేసి పది నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ వాటర్ లో నాలుగు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ ఉల్లిపాయ జ్యూస్)Onion Juice ), వన్ టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేస్తే మన సీరం అనేది రెడీ అవుతుంది.

ఈ సీరం ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి.గంట అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ సీరం ను ఉపయోగిస్తే అనేక బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.ఈ న్యాచురల్ సీరం హెయిర్ రూట్స్ ను స్ట్రాంగ్ గా మారుస్తుంది.
హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ చేస్తుంది.ఈ సీరంను వాడటం వల్ల జుట్టు పొడుగ్గా, ఒత్తుగా పెరుగుతుంది.
అలాగే ఈ సీరం కురులను స్మూత్ గా షైనీగా మెరిపించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.పైగా ఈ సీరంలో ఉల్లిపాయ జ్యూస్ ను యాడ్ చేయడం వల్ల అది చుండ్రు నివారణకు తోడ్పడుతుంది.
ఈ సీరం జుట్టునే కాకుండా స్కాల్ప్ ను కూడా హెల్తీగా మారుస్తుంది.