ముకుంద సినిమా ద్వారా 2014లో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే.టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన తొలినాళ్లలో హిట్ కోసం చాలా కష్టపడింది.
కానీ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది.కన్నడ గడ్డ మీద పుట్టి పెరిగిన ఈ పొడుగు కాళ్ల సుందరి.
సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.అందులోనూ టాలీవుడ్ లో మంచి సక్సెస్ రేటుతో ముందుకు దూసుకెళ్తుంది.
టాలీవుడ్ లోని టాప్ హీరోల సరసన నటిస్తూ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంటుంది.
ప్రస్తుతం తెలుగులో ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది.
ఆచార్య, మోస్ట్ ఎలియబుల్ బ్యాచిలర్, రాధేశ్యామ్ సినిమాలతో సినీ అభిమానులను అలరించేందుకు రెడీ అవుతుంది.అటు సల్మాన్ ఖాన్, దళపతి విజయ్ సినిమాల్లోనూ హీరోయిన్ గా ఓకే అయ్యింది.
అలవైకుఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఆమె రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.
ఓ వైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది.బాలీవుడ్ యాక్టర్ తో పీకల్లోతు ప్రేమలో ఉందట.ప్రస్తుతం అతడితో కలిసి డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
టైం దొరికినప్పుడల్లా వీరిద్దరు చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నట్లు తెలుస్తోంది.ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ప్రేమలో పడిని ఆ అందగాడు మరెవరో కాదు.
బాలీవుడ్ స్టార్ హీరో వినోద్ మెహ్రా కొడుకు రోహన్.వీరిద్దరి గురించి మీడియాలో పెద్ద ఎత్తున్న వార్తలు వస్తున్నాయి కూడా.
సోషల్ మీడియాలోనూ వీరి ప్రేమ గురించి చర్చోప చర్చలు జరుగుతున్నాయి.అయితే ఈ వార్తల మీద వీరిద్దరు ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్ చేయలేదు.
నిజంగా డేటింగ్ చేస్తున్నారు కాబట్టే సైలెంట్ గా ఉన్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.వీరి ప్రేమలో నిజం ఎంత ఉందో తెలియాలంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు స్పందిచాల్సిందే.
అప్పటి వరకు ఊహాగానాలు తప్ప.నిజా నిజాలు ఏంటో బయటకు మాత్రం తెలియదు.
ఎనీవే.వీరిద్దరు ప్రేమ మున్ముందు ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.