బహామాస్ వెళ్లాలనుకుంటున్న అమెరికన్ టూరిస్టులకు ( American tourists ) యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ షాకింగ్ న్యూస్ చెప్పింది.బహామాస్‌లో క్రైమ్ రేట్ పెరిగిపోవడం, బోటింగ్ యాక్సిడెంట్స్, షార్క్ ఎటాక్స్‌లు ఎక్కువ అవుతుండటంతో టూరిస్టులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
మార్చి 31న రిలీజ్ చేసిన కొత్త అడ్వైజరీలో ఈ విషయాలన్నీ వెల్లడించింది.బహామాస్‌లో దొంగతనాలు, సెక్సువల్ అసాల్ట్స్ లాంటి భయంకరమైన నేరాలు బాగా పెరిగిపోయాయి.
న్యూ ప్రొవిడెన్స్, గ్రాండ్ బహామా ఐలాండ్స్‌లోని నాసావు, ఫ్రీపోర్ట్ సిటీల్లో అయితే మరీ దారుణం.నాసావులోని షిర్లీ స్ట్రీట్‌కు( Shirley Street in Nassau ) దక్షిణాన ఉన్న “ఓవర్ ది హిల్” ఏరియాలో గ్యాంగ్ వార్‌లు జరుగుతున్నాయని, అక్కడ అడుగుపెట్టడం కూడా ప్రమాదకరమని తేల్చి చెప్పింది.
అంతేకాదు, ప్రైవేట్ సెక్యూరిటీ లేని ఇళ్లలో అద్దెకు దిగితే అంతే సంగతులని వార్నింగ్ ఇచ్చింది.మీరు బస చేసే చోట డోర్లు, కిటికీలు గట్టిగా లాక్ చేసుకోవాలి.
ఎవరికి పడితే వాళ్లకు డోర్ తెరవొద్దని, ఒకవేళ దొంగతనం జరిగితే అస్సలు ఎదురించొద్దని, ప్రాణాలకే ప్రమాదం అని సీరియస్‌గా హెచ్చరించింది.బహామాస్‌కు వెళ్లేముందు లగేజీ చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు.
గన్నులు, బుల్లెట్లు అక్కడ చట్టరీత్యా నేరం.ఇప్పటికే చాలామంది అమెరికన్ టూరిస్టులు జైలుకు వెళ్లారు, ఫైన్లు కట్టారు.

వాటర్ యాక్టివిటీస్( Water activities ) విషయానికొస్తే.అక్కడ బోటింగ్ రూల్స్ అస్సలు బాగోలేవు.చాలా బోట్లు సేఫ్టీ స్టాండర్డ్స్‌కి విరుద్ధంగా ఉంటున్నాయి.ఆపరేటర్లకు లైసెన్సులు, ఇన్సూరెన్స్ కూడా ఉండటం లేదు.రీసెంట్‌గా జరిగిన యాక్సిడెంట్స్‌లో చాలామంది టూరిస్టులు చనిపోయారు, చాలామందికి సీరియస్ ఇంజ్యూరీస్ అయ్యాయి.అందుకే న్యూ ప్రొవిడెన్స్, పారడైజ్ ఐలాండ్స్‌లో గవర్నమెంట్ ఉద్యోగులు జెట్ స్కీయింగ్ లాంటివి చేయొద్దని ఆర్డర్స్ కూడా పాస్ చేసింది.
నాసావు బీచ్‌ల దగ్గర జెట్ స్కీ ఆపరేటర్లు సెక్సువల్ అసాల్ట్స్‌కు పాల్పడుతున్నారని కేసులు కూడా నమోదయ్యాయి.

ఇంకా షార్క్ ఎటాక్స్‌లు కూడా పెరిగిపోయాయట.టూరిస్టులు ఒంటరిగా స్విమ్మింగ్ చేయొద్దని, బోట్ల దగ్గర జాగ్రత్తగా ఉండాలని, స్నోర్కెలింగ్ చేసేముందు ఫిట్‌నెస్‌ను చెక్ చేసుకోవాలని సూచించింది.వెదర్, వాటర్ కండిషన్స్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి.
పబ్లిక్ టాయిలెట్స్‌లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.ఎమర్జెన్సీ సిట్యువేషన్స్‌లో హెల్ప్ కోసం, అలర్ట్స్ కోసం ‘స్మార్ట్ ట్రావెలర్ ఎన్‌రోల్‌మెంట్ ప్రోగ్రామ్ (STEP)’లో రిజిస్టర్ చేసుకోవాలని, ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని, సీడీసీ ట్రావెల్ హెల్త్ గైడ్‌లైన్స్‌ను చెక్ చేసుకోవాలని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ స్ట్రాంగ్‌గా రికమెండ్ చేస్తోంది.