కొచ్చి ఉద్యోగులపై వేధింపులు.. ట్విస్ట్‌ మాములుగా లేదుగా! అసలు నిజం ఇదేనన్న పోలీసులు!

ప్రస్తుత కాలంలో యువత ఎక్కువగా ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలను ఎన్నుకుంటున్నారు.కానీ, ఎక్కువ శాతం ఉద్యోగాల్లో పనిభారం, టార్గెట్ల ఒత్తిడి, మానసిక శ్రమలు ఎక్కువవుతున్నాయి.

 Harassment Of Kochi Employees.. The Twist Is Not Uncommon! The Police Say This I-TeluguStop.com

ముఖ్యంగా మార్కెటింగ్ రంగంలో టార్గెట్లు పూర్తి చేయాలన్న ఒత్తిడి వల్ల ఉద్యోగులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు.టార్గెట్‌ సాధించలేదని ఎదురు దాడులు, బెదిరింపులు, అవమానాలు(Counterattacks, threats, insults) ఎదుర్కొనాల్సిన దుస్థితి నెలకొంటోంది.

అయితే ఇటీవల కేరళలో చోటుచేసుకున్న ఒక సంఘటన ఈ వ్యవహారాన్ని మరింత సీరియస్‌గా మార్చింది.

కేరళ రాష్ట్రంలోని కొచ్చి(Kochi in the state of Kerala) సమీపంలోని పెరుంబవూర్‌లో ఉన్న ఓ ప్రైవేట్ మార్కెటింగ్ సంస్థలో పని చేసే ఉద్యోగులను టార్గెట్లు రీచ్ చేయలేదని, వారి మెడలో బెల్ట్ కట్టి కుక్కల్లా నడిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు కాస్త ఘాటుగానే స్పందించారు.“ఇంత నీచంగా ఉద్యోగులను ఎలా అవమానించగలరు?” అంటూ సోషల్ మీడియాలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.దీనిపై స్పందించిన పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

Telugu Employee, Job Stress, Kerala, Kochi, Job Pressure, Perumbavoor, Private C

ఇకపోతే తాజాగా విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.వీడియోలో కనిపించిన సంఘటనలు నాలుగు నెలల క్రితం జరిగాయని, ఆ సమయంలో ఆ సంస్థలో పనిచేసిన ఓ మాజీ మేనేజర్‌కు యాజమాన్యంతో విభేదాలు తలెత్తినట్లు పోలీసులు గుర్తించారు.ఆ మేనేజర్ (Manager)తన గొడవల వల్ల ఉద్యోగం విడిచి వెళ్లిపోయాడు.

అయితే వెళ్లేముందు, ట్రైనింగ్ పేరుతో కొత్తగా జాయిన్ అయిన ట్రైనీలతో సరదా యాక్టివిటీ చేస్తున్నామని చెప్పి.వారికి తెలియకుండా వారి మెడలో బెల్ట్ కట్టి కుక్కలాగా నడిపించాడు.

ఆ దృశ్యాలను వీడియో తీసి, తర్వాత ఇప్పుడు కంపెనీ పేరును చెడగొట్టే ఉద్దేశంతో సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు.

Telugu Employee, Job Stress, Kerala, Kochi, Job Pressure, Perumbavoor, Private C

ఈ వీడియోలో కనిపించిన ఉద్యోగుల్లో ఒకరు ప్రస్తుతం కూడా అదే కంపెనీలో పనిచేస్తున్నారు.పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అతను, “అది ఫన్ యాక్టివిటీగా చేశామంటూ మేనేజర్ చెప్పాడు.కానీ, మా అనుమతి లేకుండా వీడియో తీసి ఇప్పుడు తప్పుదారి పట్టించాడు” అని చెప్పారు.

ఈ వివరాలన్నింటిని సేకరించిన పోలీసులు ఇప్పుడు ఆ మాజీ మేనేజర్‌పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.ఇది కేవలం ఒక వ్యక్తిగత ప్రతీకార చర్యగా మారిన విషయం అనిధ్రువీకరించింది.

ఈ సంఘటన ఆధారంగా చూస్తే, ఉద్యోగాల్లో పని ఒత్తిడి మాత్రమే కాదు, వ్యక్తిగత విభేదాలు ఎంత దారుణంగా మారవచ్చో స్పష్టంగా తెలుస్తోంది.సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి వైరల్ వీడియోకు వెంటనే నమ్మకపోవడం, పూర్తి నిజాన్ని తెలుసుకొని స్పందించాల్సిన అవసరం ఉన్నదని ఈ సంఘటన చెబుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube