తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.మరి ఇలాంటి సందర్బంలోనే తమదైన రీతిలో సత్తా చాటుకోవాలనుకుంటున్న స్టార్ హీరోలందరు మరొకసారి స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ విజయాలను అందుకుంటున్న ప్రభాస్(Prabhas) లాంటి స్టార్ హీరో సైతం ఇప్పుడు పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు.
ఇక స్పిరిట్ ( Spirit)సినిమాలో ఆయన పవర్ ఫుల్ పాత్రలో కనిపించడమే కాకుండా ఇప్పటివరకు ఉన్న సినిమాల రికార్డులన్నింటిని బ్రేక్ చేయడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు.
అయితే ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రతోపాటు ఆయన సినిమాలో ఒక మెసేజ్ కూడా ఇవ్వబోతున్నారట.మరి అది ఏంటి అనేది తెలియాల్సి ఉంది.
ఇక సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga)లాంటి దర్శకుడు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తున్నాడు.ఇక ఇప్పటివరకు ఆయన చేసిన అర్జున్ రెడ్డి, అనిమల్(Arjun Reddy, Animal) లాంటి సినిమాలు మంచి విజయాలను సాధించాయి.
స్పిరిట్ సినిమాతో 2000 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది…ఇది ఏమైనా కూడా ఇప్పటి వరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ హీరోలకు మంచి గుర్తింపు అయితే ఉంది.

ఇక దర్శకులు కూడా భారీ క్రేజ్ ను సంపాదించుకుంటున్నారు.ఇక డైరెక్టర్లలో రాజమౌళి (Rajamouli)తర్వాత అంత గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డివంగ కావడం విశేషం… ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా ఇకమీదట చేయబోయే సినిమాలతో ఆయన మాత్రం పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది…