వైట్ హౌస్ గార్డెన్స్‌ను చూసే ఛాన్స్.. సందర్శకులకు గుడ్‌న్యూస్ చెప్పిన మెలానియా ట్రంప్!

వైట్ హౌస్ గార్డెన్స్( White House Gardens ) చూడాలని చాలామందికి ఉంటుంది.వారందరి కోసమే ఈ గుడ్ న్యూస్.

 Melania Trump Shares Good News For Chance Visitors To See The White House Garden-TeluguStop.com

ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా వసంత ఋతువులో వైట్ హౌస్ గార్డెన్స్ తలుపులు తెరుచుకున్నాయి.ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ స్వయంగా అందరినీ ఆహ్వానించారు.

ఏప్రిల్ నెలలో వసంత శోభతో కళకళలాడే వైట్ హౌస్ గార్డెన్స్ చూసేందుకు ఆదివారం తెల్లవారుజామునే సందర్శకులు క్యూ కట్టారు.వాతావరణం మేఘావృతమై, చిరుజల్లులు పడే అవకాశం ఉన్నా జనం మాత్రం తగ్గలేదు.

అసలైతే ఈ టూర్లు శని, ఆదివారాల్లో పెట్టాలనుకున్నారు.కానీ వైట్ హౌస్ దగ్గర ఉన్నట్టుండి ఆందోళనలు మొదలయ్యాయి.

దాంతో శనివారం టూర్ క్యాన్సిల్ చేశారు.అందుకే ఆదివారం ఒక్కరోజే టూర్ పెట్టారు.

అందరి భద్రత ముఖ్యమని, అందుకే ఇలా చేశామని అధికారులు ఒక ప్రకటనలో చెప్పారు.

Telugu Historic Tree, Melania Trump, Melaniatrump, Publicgarden, Garden, White,

టూర్‌లో జనం సౌత్ లాన్‌లో ఉన్న చాలా గార్డెన్‌లు చూసి ఫిదా అయిపోయారు.రోజ్ గార్డెన్, జాక్వెలిన్ కెన్నెడీ గార్డెన్, కిచెన్ అండ్ కటింగ్ గార్డెన్, చిల్డ్రన్స్ గార్డెన్, ఫ్లవర్ గార్డెన్.ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.

ఇంకో విషయం ఏంటంటే, పాత ప్రెసిడెంట్లు, ముఖ్యమైన రోజులు గుర్తుగా ఇక్కడ ఏకంగా 33 చెట్లు ఉన్నాయి.నేషనల్ పార్క్ సర్వీస్ లెక్కల ప్రకారం 1870 నుంచి దాదాపుగా ప్రతీ అమెరికా ప్రెసిడెంట్( President of the United States ) తన హయాంలో ఇక్కడ ఒక చెట్టు నాటారట.

అందుకే వైట్ హౌస్ గార్డెన్స్ ఎప్పుడూ కొత్తగా ఉంటాయి.కాలం మారుతున్నా, కొత్త ప్రెసిడెంట్ వస్తున్నా ఈ గార్డెన్స్ మాత్రం ఎప్పటికీ ఫ్రెష్‌గానే ఉంటాయి.

Telugu Historic Tree, Melania Trump, Melaniatrump, Publicgarden, Garden, White,

అయితే ఈ టూర్‌లో ఒక స్పెషల్ మూమెంట్ కూడా ఉంది.అదేంటంటే, చరిత్రలో నిలిచిపోయిన ఒక చెట్టుకు వీడ్కోలు చెప్పడం.1829 నుంచి 1837 వరకు ప్రెసిడెంట్‌గా చేసిన ఆండ్రూ జాక్సన్ నాటిన సదరన్ మాగ్నోలియా చెట్టు బాగా పాడైపోయిందట.ఇది ప్రమాదకరంగా ఉందని, తీసేయాలని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్( President Donald Trump ) రీసెంట్‌గా చెప్పారు.

అందుకే దాన్ని తొలగించనున్నారు.అయితే సందర్శకులకు, బిల్డింగ్‌కు ఏమీ కాకుండా ఉండాలని ఆదివారం ఆ చెట్టుకు వైర్లు కట్టి సపోర్ట్ ఇచ్చారు.

ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్, ప్రెసిడెంట్ ట్రంప్, ఇంకా పాత ఫస్ట్ ఫ్యామిలీస్ గార్డెన్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు కూడా అక్కడ పెట్టారు.చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఆ గార్డెన్‌లో ప్రశాంతంగా తిరుగుతూ ఎంజాయ్ చేశారు.

మరి ఇంకో హైలైట్ ఏంటంటే.ప్రెసిడెంట్ వాడే “ది బీస్ట్” లిమోసిన్ కారుని అక్కడ పార్క్ చేశారు.

దాంతో జనాలు దాని దగ్గర ఫొటోలు దిగడానికి పోటీపడ్డారు.ఈ ఈవెంట్ సక్సెస్ అవ్వడానికి వైట్ హౌస్‌తో పాటు ట్రస్ట్ ఫర్ ది నేషనల్ మాల్ అనే సంస్థ కూడా హెల్ప్ చేసింది.

ఈ సంస్థ డొనేషన్లు, వాలంటీర్లతో సపోర్ట్ చేస్తుంది.ఫస్ట్ లేడీ ఆఫీస్ స్పోక్స్‌పర్సన్ నికోలస్ క్లెమెన్స్ మాట్లాడుతూ, ఈ సంప్రదాయాన్ని కంటిన్యూ చేయడం చాలా హ్యాపీగా ఉందని చెప్పారు.

తరతరాలుగా ఎంతో కేర్ తీసుకుంటున్న ఈ గార్డెన్‌లను ప్రజలు చూడటం ఒక మంచి ఛాన్స్ అని ఆయన అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube