ఇంట్లో ఉండే ఈ మూడు పదార్థాలతో మొండి మచ్చలను తరిమి కొట్టండి.. క్లియర్ స్కిన్ ను సొంతం చేసుకోండి!

చర్మం ఎంత తెల్లగా, మృదువుగా ఉన్నా అక్కడక్కడ ముదురు రంగులో కనిపించే మచ్చలు( Scars ) ముఖ సౌందర్యాన్ని తీవ్రంగా పాడుచేస్తాయి.అందుకే ఎలాంటి మచ్చలు లేకుండా క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్( Glowing Skin ) ను కోరుకుంటారు.

 This Simple Remedy Helps To Remove Blemishes And Brighten The Face!, Simple Reme-TeluguStop.com

ఈ క్రమంలోనే ముఖంపై ఉన్న మొండి మచ్చలను నివారించుకునేందుకు తోచిన ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే కచ్చితంగా మీరు ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటించాల్సిందే.ఈ హోమ్ రెమెడీ ఎలాంటి మచ్చలనైనా నివారిస్తుంది.

ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

Telugu Tips, Blemishes, Brighten Skin, Clear Skin, Dark Spots, Skin, Latest, Sim

ముందుగా ఒక నిమ్మ పండు( Lemon )ను తీసుకొని ఉప్పు నీటిలో శుభ్రంగా కడగాలి.ఆ తర్వాత తడి లేకుండా తుడిచి పై తొక్క వచ్చేలా తురుముకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక చిన్న కప్పు కొబ్బరి నూనె( Coconut Oil ) వేసుకోవాలి.అలాగే ఐదు నుంచి ఆరు లవంగాలు మరియు నిమ్మ తొక్కల తురుము వేసుకుని చిన్న మంటపై ఉడికించాలి.

రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.ఆపై మూత పెట్టి ఆయిల్ చల్లారే వరకు వదిలేయాలి.ఆయిల్ పూర్తిగా కూల్ అయ్యాక‌ స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.

Telugu Tips, Blemishes, Brighten Skin, Clear Skin, Dark Spots, Skin, Latest, Sim

ఈ ఆయిల్ ను రోజు ఉదయం, సాయంత్రం స్నానం చేయడానికి గంట ముందు ముఖానికి అప్లై చేసుకుని బాగా మసాజ్ చేసుకోవాలి.రోజుకు రెండు సార్లు వాడితే కనుక ఎలాంటి మచ్చలైన క్రమంగా మాయమవుతాయి.ముడతలు ఏమైనా ఉంటే దూరం అవుతాయి.

స్కిన్ టైట్ గా, గ్లోయింగ్ గా మారుతుంది.నిమ్మ పండు, కొబ్బరి నూనె, లవంగాలు( Cloves ). ఇవి మూడు అందరి ఇంట్లో ఉండేవే.వీటితోనే ఈజీగా మరియు వేగంగా మొండి మచ్చలను తరిమి కొట్టండి.

క్లియర్ స్కిన్ ను సొంతం చేసుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube