వైరల్ వీడియో: మటన్ కర్రీ ఎంత పని పెట్టింది.. వృద్ధుడి గొంతులో ఇరుక్కున్న ఎముక.. చివరకు..

ఈరోజుల్లో ఆదివారం వస్తే ప్రతి ఇంట్లో నాన్‌వెజ్ తప్పనిసరి ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు చాలామంది.వారం అంతా కూరగాయాతో కుస్తీ పట్టిన మాంసాహార ప్రియులు ఆదివారం వస్తే చాలు తినే ప్లేట్ లో నాన్‌వెజ్ తప్పనిసరి ఉండాల్సిందే.

 Kamineni Doctors Successfully Removed Mutton Bone In Throat Details, Viral Video-TeluguStop.com

పళ్ళెం నిండా మంచి మంచి ముక్కలు, నల్లి తొక్కలు వేసి ఎంతో ఆనందంగా తింటారు.నిరుపేదలు, మధ్యతరగతి వారు కోడిమాంసం, చేపలతో సర్దుకు పోతుండగా.

, ఆర్థిక స్థోమత ఉన్నవారు రాత్రి భోజనానికి మటన్( Mutton ) మాంసం తింటారు.

కొన్ని సందర్భాల్లో, ఈ మాంసాహారం మన జీవితాలను నాశనం చేస్తుంది.ఇలాంటి ఘటనే యాద్రాద్రి జిల్లా( Yadadri District ) ప్రాంతంలో చోటుచేసుకుంది.ఇక ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామానికి చెందిన అనంతుల శ్రీరాములు( Anantula Sriramulu ) మంగళవారం మటన్ కర్రీ తింటుండగా గొంతులో ఎముక( Bone ) అడ్డుపడింది.దీని కారణంగా, వృద్ధుడు నానా అవస్థలు పడ్డాడు.

దాంతో ఎలాగైనా ఎముకను బయటకు తీయాలని కుటుంబ సభ్యులు చాలా ప్రయత్నాలు చేశారు.అయితే ఎముక బయటకు రాకపోవడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించారు.

అనంతరం అక్కడ ఎండోస్కోపీ సహాయంతో మాంసం ఎముకని తొలగించి వృద్ధుడి ప్రాణాలను కాపాడారు.దాంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.మాంసాహారం తినడంలో ఎలాంటి తప్పులేకపోయినా.తినడానికి ముందు ఆహారాన్ని కాస్త తనిఖీ చేయాలని వైద్యులు చెబుతున్నారు.లేకుంటే ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి అని వైద్యులు పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube