రాష్ట్ర ఎన్నికల స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ ను తొలగించండి అంటూ వైసీపీ ఫిర్యాదు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ ముగిశాక కూడా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.ముఖ్యంగా పల్నాడులో ( Palnadu ) వైసీపీ.

 Ycp Complains About Removal Of Special Police Observer For State Elections Detai-TeluguStop.com

టీడీపీ కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్నారు.బాంబులు కూడా విసురుకోవటం జరిగింది.

బలహీన సామాజిక వర్గాలకు చెందిన ఇళ్లపై దాడులు చేశారు.గతంలో మునుపెన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి.

ప్రధానంగా తాడిపత్రి, చంద్రగిరి, మాచర్ల, నరసరావుపేటలో ఘర్షణ వాతావరణం నెలకొంది.ఇదిలా ఉంటే పోలిసుల వైఫల్యంతోనే రాష్ట్రంలో దాడులు, అరాచకాలు జరిగాయని వైసీపీ( YCP ) పెద్దలు ఆరోపిస్తున్నారు.

ఇదే సమయంలో రాష్ట్ర ఎన్నికల స్పెషల్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాను( Deepak Mishra ) వెంటనే విధుల నుంచి తొలగించాలని ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేయడం జరిగింది.ఆయన తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై.ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది.ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగాలంటే దీపక్ మిశ్రాను తొలగించి. మరో నిజాయితీగల అధికారిని నియమించాలని కోరుతూ ఈసీకి( EC ) వైసీపీ లేఖ రాయడం జరిగింది.గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికల తర్వాత హింసాత్మక సంఘటనలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.

దీంతో ఎవరు అధికారంలోకి వస్తారో.? ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు దాపరిస్తాయో.? సామాన్యులు వణికిపోతున్నారు.రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అత్యధిక శాతం పోలింగ్ నమోదయింది.

ఇప్పటివరకు దేశంలో జరిగిన నాలుగు దశల ఎన్నికలలో.ఏపీలోనే అత్యధికంగా పోలింగ్ శాతం నమోదయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube