రాష్ట్ర ఎన్నికల స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ ను తొలగించండి అంటూ వైసీపీ ఫిర్యాదు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ ముగిశాక కూడా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.ముఖ్యంగా పల్నాడులో ( Palnadu ) వైసీపీ.

టీడీపీ కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్నారు.బాంబులు కూడా విసురుకోవటం జరిగింది.

బలహీన సామాజిక వర్గాలకు చెందిన ఇళ్లపై దాడులు చేశారు.గతంలో మునుపెన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి.

ప్రధానంగా తాడిపత్రి, చంద్రగిరి, మాచర్ల, నరసరావుపేటలో ఘర్షణ వాతావరణం నెలకొంది.ఇదిలా ఉంటే పోలిసుల వైఫల్యంతోనే రాష్ట్రంలో దాడులు, అరాచకాలు జరిగాయని వైసీపీ( YCP ) పెద్దలు ఆరోపిస్తున్నారు.

"""/" / ఇదే సమయంలో రాష్ట్ర ఎన్నికల స్పెషల్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాను( Deepak Mishra ) వెంటనే విధుల నుంచి తొలగించాలని ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేయడం జరిగింది.

ఆయన తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై.ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది.

ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగాలంటే దీపక్ మిశ్రాను తొలగించి.మరో నిజాయితీగల అధికారిని నియమించాలని కోరుతూ ఈసీకి( EC ) వైసీపీ లేఖ రాయడం జరిగింది.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికల తర్వాత హింసాత్మక సంఘటనలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.

దీంతో ఎవరు అధికారంలోకి వస్తారో.? ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు దాపరిస్తాయో.

? సామాన్యులు వణికిపోతున్నారు.రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అత్యధిక శాతం పోలింగ్ నమోదయింది.

ఇప్పటివరకు దేశంలో జరిగిన నాలుగు దశల ఎన్నికలలో.ఏపీలోనే అత్యధికంగా పోలింగ్ శాతం నమోదయింది.