నేను సంపాదించిన ఆస్తులు నాకు సుఖాన్ని ఇవ్వలేదు : నటి జయసుధ

జయసుధ( Jayasudha ) నాచురల్ నటిగా ఎన్నో ఏళ్ల పాటు సినిమా ఇండస్ట్రీలో ఉంటూ కోట్ల రూపాయల ఆస్తులను కూడా పెట్టారు.అలాగే సినిమాలు తీసి వాటిని పోగొట్టుకున్నారు.

 Jayasudha About Her Properties Details, Jayasudha, Jayasudha Properties, Jayasud-TeluguStop.com

తన భర్త నితిన్( Nithin ) కూడా అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు.పిల్లలను సెటిల్ చేద్దాం అన్నా కూడా వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో మనుగడ సంపాదించుకోలేకపోయారు.

ఇలా ఎన్నో విషయాలు జయసుధ జీవితంలో కలిసి రాలేదు.అయితే జయసుధకు కెరియర్ మాత్రం ఎప్పుడూ బాగా కలిసి వచ్చింది.

ఆమెకు భర్త పిల్లలు సెటిల్ అవ్వకపోయినా ఆమె సంపాదించిన ఆస్తుల వల్ల కూడా ఏ రోజు సుఖపడలేదట.శోభన్ బాబు,( Sobhan Babu ) మురళీమోహన్( Murali Mohan ) లాంటి వారితో ఆమెకు ఎక్కువగా స్నేహం ఉండేది.

అందుకే వారిలాగానే భూములు కొనాలని ప్రయత్నించింది.

Telugu Jayasudha, Murali Mohan, Sobhan Babu, Tollywood-Movie

ఆస్తులను పెంచుకోవాలని ఎంతగానో చూసింది కానీ జయసుధకు వాటి వల్ల ప్రశాంతత కరువైందట.ఎలా అంటే ఆమె చెన్నైలో ఒక చోట భూమి కొనుక్కొని ఏడు అంతస్తుల మేడ నిర్మించారట.అది షాపింగ్ కాంప్లెక్స్ ఇలాంటి వాటికి పనికి వస్తుందని చాలా భారీ ఎత్తున డబ్బు ఖర్చు పెట్టారట.

చివరికి శోభన్ బాబు కూడా ఫోన్ చేసే మంచి పని చేశావు అక్కడ భూమి కొని అని మెచ్చుకున్నారట.కానీ ఆ ప్రాపర్టీకి ఎవ్వరూ రెంట్ తీసుకోలేదట అలాగే దానిని అమ్మడానికి కూడా ఏళ్ల పాటు ప్రయత్నించినా కుదరలేదట.

చివరికి ఎంతో నష్టానికి అది అమ్ముకొని అక్కడి నుంచి బయటపడ్డారట.ఇక మరో చోట తొమ్మిది ఎకరాల భూమిని కొనుక్కున్నారట జయసుధ.

Telugu Jayasudha, Murali Mohan, Sobhan Babu, Tollywood-Movie

ఎంత ప్రయత్నించినా అక్కడ బోర్ పడక నీళ్లు రాలేదట.నీళ్లు లేనిచోట మనుగడ ఎలా ఉంటుంది చెప్పండి అందుకే ఆ భూమిని ( Land ) కూడా అమ్మేసుకున్నారట.అది కూడా తక్కువ రేటుకు అమ్మేసారట.ఇప్పుడు ప్రస్తుతం దానికి కాంపౌండ్ వాల్ ఆనుకొని రజినీకాంత్ నివాసం ఉంటున్న ఇల్లు ఉందట.అప్పట్లో దానికి చాలా తక్కువ విలువ ఉన్న ఇప్పుడు ఎకరం 100 కోట్లకు పైగానే ఉందట అలాంటి ప్రాపర్టీని అమ్ముకున్నందుకు ఈ రోజు ఎంతగానో బాధపడుతున్నారు.కానీ ఇవన్నీ ఆరోజు ఆమెకు చాలా తలనొప్పులుగా ఉండేవట.

అందుకే ఆమెకున్న ఆస్తులు కూడా ఏ రోజు తనకు ప్రశాంతత ఇవ్వలేదు అంటున్నారు జయసుధ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube