న్యూస్ రౌండప్ టాప్ 20

1.నిర్మలా సీతారామన్ కు పురందరేశ్వరి లేఖ

Telugu Ap, Chandrababu, Cm Kcr, Jagan Ysrcp, Komativenkat, Roja, Pavan Kalyan, P

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు దగ్గుపాటి పురందరేశ్వరి లేఖ రాశారు.ఏపీ ప్రభుత్వం కు సంబంధించి అనేక ఫిర్యాదులు చేస్తూ ఆమె లేఖ రాశారు.

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com

2.కెసిఆర్ కు వెంకటరెడ్డి లేఖ

భువనగిరిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేక విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ఏళ్లు గడుస్తున్నా సీఎం కేసీఆర్ ఎన్నికల హామీని ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రశ్నిస్తూ,  కాంగ్రెస్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్ కు లేఖ రాశారు.

3.హైదరాబాద్ విజయవాడ మధ్య నిలిచిన రాకపోకలు

Telugu Ap, Chandrababu, Cm Kcr, Jagan Ysrcp, Komativenkat, Roja, Pavan Kalyan, P

హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు వచ్చి చేరడంతో, ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ఐతవరం గ్రామ సమీపంలో నేషనల్ హైవే నుంచి మున్నేరు వరద నీరు  ప్రవహిస్తుండడంతో హైదరాబాద్ విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.దీంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పోలీసులు ట్రాఫిక్ ను మళ్ళిస్తున్నారు.

4.పవన్ కళ్యాణ్ పై రోజా విమర్శలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి ఆర్కే రోజా విమర్శలు చేశారు.మీ వల్ల ఎంతమంది అమ్మాయిలు అదృశ్యం అయ్యారో లెక్క తేలాలి అంటూ సెటైర్లు వేశారు.

5.తెలంగాణ క్యాబినెట్ భేటీ

Telugu Ap, Chandrababu, Cm Kcr, Jagan Ysrcp, Komativenkat, Roja, Pavan Kalyan, P

ఈనెల 31న తెలంగాణ క్యాబినెట్ భేటీ జరగనుంది.వరద సాయం, ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు పెంపుపై చర్చ జరగనుంది.

6.ఏఓబి లో హై అలర్ట్

నేటి నుంచి మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు నేటి నుంచి ఆగస్టు 5 వరకు ఈ వారోత్సవాలను మావోయిస్టులు నిర్వహిస్తున్నారు.

7.తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు

Telugu Ap, Chandrababu, Cm Kcr, Jagan Ysrcp, Komativenkat, Roja, Pavan Kalyan, P

తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తున్నాయి.కొన్ని జిల్లాల్లో ప్రతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

8.రొట్టెల పండుగ

నెల్లూరు నగరంలో జరగనున్న రొట్టెల పండుగ ఏర్పాట్లను ఎమ్మెల్యే కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి పరిశీలించమన్నారు.

9.ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ క్యాన్సర్ ఆస్పత్రిలో…

Telugu Ap, Chandrababu, Cm Kcr, Jagan Ysrcp, Komativenkat, Roja, Pavan Kalyan, P

నెల్లూరులోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ క్యాన్సర్ ఆస్పత్రులలో వివిధ విభాగాలను టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు.

10.యువగళం పాదయాత్ర

నారా లోకేష్ యువ గళం పాదయాత్ర కు విరామం ప్రకటించారు.ఒంగోలు శివారు క్యాంప్ సైట్ లో జయహో బిసి సదస్సును లోకేష్ నిర్వహించనున్నారు.

11.భారీ వర్ష సూచన

Telugu Ap, Chandrababu, Cm Kcr, Jagan Ysrcp, Komativenkat, Roja, Pavan Kalyan, P

ఈరోజు ప్రకాశం జిల్లాకు భారీ వర్షం సూచనలు జారీ చేసింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అత్యవసర పరిస్థితులకు టోల్ ఫ్రీ నెంబర్ 1070,18004250101 ను ఏర్పాటు చేశారు.

12.కవిత పిటిషన్ ను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం

ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బై బి.ఆర్.ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది.

13.చంద్రబాబు కామెంట్స్

Telugu Ap, Chandrababu, Cm Kcr, Jagan Ysrcp, Komativenkat, Roja, Pavan Kalyan, P

పోలవరం తరతరాల ఆకాంక్ష అని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు.పోలవరం రాష్ట్రానికి వరం అని, జగన్ శని అని అహంకారంతో పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారని చంద్రబాబు విమర్శించారు.

14.తుంగభద్ర కు భారీగా వరద నీరు

తుంగభద్ర జలాశయం కి వరదనీరు చేరిక ఎక్కువవుతుంది.ఎల్లేల్సి కి  సాగునీటిని విడుదల చేస్తున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు.

15.మణిపూర్ వ్యవహారంపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

Telugu Ap, Chandrababu, Cm Kcr, Jagan Ysrcp, Komativenkat, Roja, Pavan Kalyan, P

మణిపూర్ వీడియో లీకేజీ వెనక కుట్ర దాగి ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు.

16.అన్నమాలై పాదయాత్ర ప్రారంభం

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలై నేటి సాయంత్రం రామేశ్వరం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు.

17.అమిత్ షా పర్యటన రద్దు

Telugu Ap, Chandrababu, Cm Kcr, Jagan Ysrcp, Komativenkat, Roja, Pavan Kalyan, P

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు అయ్యింది.

18.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది .శ్రీవారి టోకెన్ రహిత సందర్శనం కోసం 23 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

19.ఏపీలో గంజాయి సాగే లేదు

Telugu Ap, Chandrababu, Cm Kcr, Jagan Ysrcp, Komativenkat, Roja, Pavan Kalyan, P

ఏపీలో ప్రస్తుతం గంజాయి సాగు లేదని, ఒడిశా నుంచి సరఫరా అవుతుందని , అయినా గంజాయి రవాణా పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఏపీ డీజీపీ రాజేందర్ నాథ్ రెడ్డి తెలిపారు.

20.ప్రియాంక కొల్లాపూర్ సభ మళ్లీ వాయిదా

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో ఈనెల 30 న జరగాల్సిన ప్రియాంక గాంధీ సభ మరోసారి వాయిదా పడింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube