యముడు బ్రేక్ లో ఉన్నాడు కాబోలు.. రెప్పపాటులో పిల్లాడి ప్రాణం..

ప్రతిరోజు ఏదో ఒక ప్రమాదం సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.వర్షాకాలం నేపథ్యంలో చాలా చోట్ల వరదలకు సంబంధించిన సంఘటనలో కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయారు.

 Viral Video Little Kid Escapes Brutal Hit By Truck At Last Minute Details, Viral-TeluguStop.com

రోడ్డు నియమాలు పాటించకుండా వెళ్లే వారి వల్ల రోడ్డుపై కూడా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు.చిన్న తప్పిదంతో వారి ప్రాణాలను రిస్క్ లో పెట్టుకోవడమే కాకుండా ఎదుటోడి ప్రాణాలు కూడా రిస్కులో పెడుతున్నారు.

వాహనం తోలే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా.ఎదుటోడి జాగ్రత్త వల్ల కూడా కొన్నిసార్లు ప్రమాదాలు సంభవించవచ్చు.

తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో ఇద్దరు చిన్నారులు స్కూల్ బస్సు( School Bus ) దిగిన తర్వాత రోడ్డు దాటడానికి( Crossing Road ) ప్రయత్నం చేస్తారు.ఈ ఘటనలో ఓ చిన్నారి తన తొందరపాటుతో రోడ్డుపై ఏమి వస్తుందన్న విషయాన్ని కూడా గ్రహించకుండా రోడ్డు దాటేందుకు ప్రయత్నం చేశాడు.అయితే అప్పటికే రోడ్డుపై మరోవైపు నుండి పెద్ద ట్రక్కు( Truck ) వేగంగా వస్తోంది.

పిల్లడు రోడ్డు దాటుతుండడంతో ఒక్కసారిగా ఆ ట్రక్కు పిల్లాడివైపుకు దూసుకు వచ్చింది.ఆ సమయంలో ట్రక్ డ్రైవర్ వ్యవహరించిన తీరుతో ట్రక్కును ఒక్కసారిగా బ్రేక్ వేశాడు.దీంతో చిన్నారికి ఎలాంటి గాయాలు కాకుండా క్షేమంగా బయటపడ్డాడు.ఆ ట్రక్కులో ఎమర్జెన్సీ బ్రేక్ సిస్టం ఉండడం కారణంతో పిల్లాడికి ఎటువంటి గాయాలు కాకుండా బయటపడ్డాడు.

ఒకవేళ డ్రైవర్ మాత్రం ఏదో ఆలోచనలో ఉంటే మాత్రం కచ్చితంగా ప్రాణం గాల్లో కలిసిపోయేది.అయితే ఇదంతా ఎదురుగా వస్తున్న ఓ వాహనం సీసీటీవీ కెమెరాలో రికార్డు కాగా అది కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్ గా మారింది.ఇక ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.నీకు ఇంకా భూమిపై బతికేందుకు కాలం ఉన్నట్లుంది అందుకే బతికిపోయావ్.అంటూ మరికొన్ని కామెంట్ చేస్తుండగా.మరికొందరేమో.

, యమధర్మరాజు ఏదో బిజీగా ఉన్నట్లు ఉన్నాడు.అందుకే.

, నిన్ను వదిలేసాడని కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube