ఫ్లాప్ అయ్యే సినిమాకు వన్ మోర్ ఎందుకన్న బాలయ్య..

ఫ్లాప్ అయ్యే సినిమాకు వన్ మోర్ ఎందుకన్న బాలయ్య.ఫ్లాప్ అయ్యే సినిమాకు వన్ మోర్ ఎందుకన్న బాలయ్య.

 Balakrishna Funny Dialogue About Thiragabadda Telugu Bidda , Balakrishna, Paruch-TeluguStop.com

నందమూరి బాలకృష్ణ హీరోగా కోదండ‌రామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన తొలి మూవీ అనసూయమ్మ గారి అల్లుడు.ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది.

ఈ సినిమా ద్వారా మంచి పేరు రావడంతో బాలయ్యతో మరో సినిమా చేయమని దర్శకుడికి చెప్పాడు ఎన్టీఆర్.ఆ సమయంలో రామారావు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు.

అప్పటి వరకు బాలయ్య సినిమాలకు సంబంధించిన కథలు ఎన్టీఆర్ వినేవాడు.ఆయనకు కథ నచ్చితేనే.

బాలయ్యకు సినిమా చేయాలని చెప్పేవాడు.అయితే రెండో సినిమా కోసం కథ చెప్పాలని కోదండరామిరెడ్డిని రమ్మన్నాడు ఎన్టీఆర్.

ఓ రోజు పరుచూరి బ్రదర్స్ ను వెంటబెట్టుకుని తెల్లవారు జామున ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లాడు.

కాసేపటి తర్వాత ఎన్టీఆర్ ను కలిశారు.

పరుచూరి బ్రదర్స్ ఓ కథ చెప్పారు.ఎన్టీఆర్ కథ విన్నారు.

మీకు కథ ఎలా అనిపించిందో చెప్పాలని కోదండరామిరెడ్డిని అడిగాడు ఎన్టీఆర్.నాకు నచ్చలేదండీ అని చెప్పాడు ఆయన.ఓకే.మీకు నచ్చకపోతే మేమెందుకు చేస్తాం? వదిలేయండి అని చెప్పాడు ఎన్టీఆర్.  తర్వాత ఇంకో కథ చూద్దాం అని చెప్పాడు.దీంతో అక్కడి నుంచి వచ్చేశాడు కోదండరామిరెడ్డి.మరో సినిమా షూటింగ్ లో ఉన్న దర్శకుడికి ఎన్టీఆర్ నుంచి కాల్ వచ్చింది.బ్రదర్ మాకు ఆ సినిమా కథ నచ్చింది.

మీరు సినిమా చేసి పెట్టండి అన్నాడు.ఆయన మాటను కాదనలేక.

ఓకే చెప్పాడు.ఆ తర్వాత ఈ కథను బాలయ్య విన్నాడు.

తనకూ ఈ సినిమా కథ నచ్చలేదు అన్నాడు.కానీ తండ్రి మాటను కాదనలేక చేశాడు.

Telugu Balakrishna, Balayya, Kodandrami-Telugu Stop Exclusive Top Stories

కొద్ది రోజుల తర్వాత షూటింగ్ మొదలయ్యింది.బాలయ్య షూటింగ్ లో పాల్గొంటున్నాడు.ఆయన సరదా సరదాగా రోజూ సినిమా షూటింగ్ కు హాజరవుతున్నాడు.అందులో బాలయ్య పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించాడు.ఒక షాట్ చేస్తున్నప్పుడు.వన్ మోర్ అని చెప్పాడు దర్శకుడు.

ఎందుకండీ వన్ మోర్.ఎలాగూ ప్లాప్ అయ్యే సినిమానే కదా అన్నాడు.

ఏదో ఒకటి ఓకే చేయండి అని చెప్పాడు.సరే అన్నాడు దర్శకుడు.

అనుకున్నట్లుగానే సినిమా విడుదల అయ్యింది.పరాజయాన్ని మూటగట్టుకుంది.

ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు తిరగబడ్డ తెలుగు బిడ్డ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube