శరీరానికి శక్తిని సమకూర్చుకోవడానికి ఓ ప్రాణి లేదా చెట్టు ఆహారాన్ని, నీటిని తీసుకునే పద్ధతినే జీవక్రియ అని అంటారని మనందరికి తెలుసు.జీవక్రియ ఎంతా బాగా ఉంటే, మన శరీరం అంత శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది.
ఈ జీవక్రియను మెరుగుపరుచుకోవడానికి కొన్నిరకాల ఆహారాలు ఉన్నాయి.ఇవి బరువుని, కొవ్వుని తగ్గించడానికి ఉపయోగపడతాయి.
వీటిని నెగెటివ్ – కాలరీ ఫూడ్స్ అని అంటారు.మంచి వ్యాయామంతో పాటు ఇప్పుడు చెప్పబోయే ఆహార పదార్థాలు మీ డైట్ లో చేర్చుకుంటే మెటబాలిజం బాగా ఇంప్రూవ్ అవుతుంది.
* చికెన్, చేపల్లో దొరికే లీన్ ప్రొటీన్ వలన మెటబాలిజం మెరుగ్గా అవుతుంది.ఇవి అరగాలంటే శరీరం మిగితా ఆహారాలతో పోల్చుకుంటే ఎక్కువ శక్రి ధారపోయాలి.
తద్వారా కొవ్వు, కాలరీలు బాగా కరుగుతాయి.
* ధాన్యాలు కూడా మెటబాలిజం మెరుగుపడటానికి సహాయపడతాయి.
బరువు తగ్గాలనుకునే వారు ధాన్యాలను ఆశ్రయిస్తే మంచిది.ఇవి ఒంటిలో కొవ్వు చేరనివ్వవు.
అలాగే ఇన్సులిన్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచి శరీరానికి తగినంత శక్తినిస్తాయి.
* వెల్లుల్లి బరువు తగ్గాలనుకునేవారికి అద్భుత ఔషధం.ఇది జీవక్రియను మెరుగుపరిచి శరీరం కొవ్వుని జమ చేయకుండా ఆపుతుంది.మనం చేసే పనుల్లో కాలరీలు కూడా ఎక్కువగా బర్న్ చేస్తుంది.
* బ్లూబెర్రి, బ్లాక్ బెర్రీ, స్ట్రాబెరి లాంటి ఫలాల్లో ఫైబర్ బాగా దొరుకుతుంది.ఇవి కాలరీలు బాగా బర్న్ చేసి, కొవ్వుని బయటకుతీసి, జీవక్రియకు ఎన్నోవిధాలుగా సహాయం చేస్తాయి.
* సిట్రస్ జాతికి చెందిన ఫలాలు.అంటే ఆరెంజ్, నిమ్మ లాంటివి.
ఇంకా ద్రాక్షపళ్ళలో విటిమిన్ సి బాగా లభిస్తుంది.విటమిన్ సి కొవ్వుని కరిగించడానికి ఎంతో ఉపయోగపడుతుంది.
* ఇవన్ని తినడం వరకు మాత్రమే కాదండోయ్.కాస్త ఒళ్లు వంచి వ్యాయామం కూడా చేయాలి.
అప్పుడే ఆరోగ్యంగా .ఎక్కువకాలం బ్రతకగలరు.