జీవక్రియను మెరుగుపరిచే ఆహారాలు ఇవి..

శరీరానికి శక్తిని సమకూర్చుకోవడానికి ఓ ప్రాణి లేదా చెట్టు ఆహారాన్ని, నీటిని తీసుకునే పద్ధతినే జీవక్రియ అని అంటారని మనందరికి తెలుసు.

జీవక్రియ ఎంతా బాగా ఉంటే, మన శరీరం అంత శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది.

ఈ జీవక్రియను మెరుగుపరుచుకోవడానికి కొన్నిరకాల ఆహారాలు ఉన్నాయి.ఇవి బరువుని, కొవ్వుని తగ్గించడానికి ఉపయోగపడతాయి.

వీటిని నెగెటివ్ - కాలరీ ఫూడ్స్ అని అంటారు.మంచి వ్యాయామంతో పాటు ఇప్పుడు చెప్పబోయే ఆహార పదార్థాలు మీ డైట్ లో చేర్చుకుంటే మెటబాలిజం బాగా ఇంప్రూవ్ అవుతుంది.

* చికెన్, చేపల్లో దొరికే లీన్ ప్రొటీన్ వలన మెటబాలిజం మెరుగ్గా అవుతుంది.

ఇవి అరగాలంటే శరీరం మిగితా ఆహారాలతో పోల్చుకుంటే ఎక్కువ శక్రి ధారపోయాలి.తద్వారా కొవ్వు, కాలరీలు బాగా కరుగుతాయి.

* ధాన్యాలు కూడా మెటబాలిజం మెరుగుపడటానికి సహాయపడతాయి.బరువు తగ్గాలనుకునే వారు ధాన్యాలను ఆశ్రయిస్తే మంచిది.

ఇవి ఒంటిలో కొవ్వు చేరనివ్వవు.అలాగే ఇన్సులిన్ లెవెల్స్ ని కంట్రోల్‌ లో ఉంచి శరీరానికి తగినంత శక్తినిస్తాయి.

"""/" / * వెల్లుల్లి బరువు తగ్గాలనుకునేవారికి అద్భుత ఔషధం.ఇది జీవక్రియను మెరుగుపరిచి శరీరం కొవ్వుని జమ చేయకుండా ఆపుతుంది.

మనం చేసే పనుల్లో కాలరీలు కూడా ఎక్కువగా బర్న్ చేస్తుంది.* బ్లూబెర్రి, బ్లాక్ బెర్రీ, స్ట్రాబెరి లాంటి ఫలాల్లో ఫైబర్ బాగా దొరుకుతుంది.

ఇవి కాలరీలు బాగా బర్న్ చేసి, కొవ్వుని బయటకుతీసి, జీవక్రియకు ఎన్నోవిధాలుగా సహాయం చేస్తాయి.

* సిట్రస్ జాతికి చెందిన ఫలాలు.అంటే ఆరెంజ్, నిమ్మ లాంటివి.

ఇంకా ద్రాక్షపళ్ళలో విటిమిన్ సి బాగా లభిస్తుంది.విటమిన్ సి కొవ్వుని కరిగించడానికి ఎంతో ఉపయోగపడుతుంది.

* ఇవన్ని తినడం వరకు మాత్రమే కాదండోయ్.కాస్త ఒళ్లు వంచి వ్యాయామం కూడా చేయాలి.

అప్పుడే ఆరోగ్యంగా .ఎక్కువకాలం బ్రతకగలరు.

కొడుకు గురించి అలా చెబితే ఆనందిస్తాను.. మాధవన్ క్రేజీ కామెంట్స్ వైరల్!