సాధారణంగా మన హిందూ దేశం ఎన్నో పవిత్రమైన దేవాలయాలకు నిలయమని చెప్పవచ్చు.ఆ దేవాలయాలలో ఎన్నో వింతలు, విశేషాలు దాగి ఉన్నాయి.
ఇప్పటికీ కొన్ని దేవాలయాలకు సంబంధించిన వింతలు రహస్యంగానే మిగిలిపోయాయి.ఈ విధంగా ప్రతి ఆలయం ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంటుంది.
ఇలాంటి ప్రత్యేకతలు కలిగి ఉన్న ఆలయంలో తమిళనాడులోని కుంభకోణానికి సమీపంలో ఎంతో ప్రసిద్ధి చెంది ఉన్న త్యాగ రాజేశ్వర ఆలయం ఒకటని చెప్పవచ్చు.ఈ ఆలయంలో ఎన్నో వింతలు అద్భుతాలను మనం చూడవచ్చు.
ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
ఈ త్యాగ రాజేశ్వరాలయాన్ని కమలాపురం అని కూడా పిలుస్తారు.
ఈ ఆలయంలో త్యాగ రాజేశ్వర స్వామి కొలువై ఉన్నారు.ఈ ఆలయంలో 9 రాజ గోపురాలు,పదమూడు మంటపాలు, పదిహేను పవిత్ర బావులు, మూడు పూలతోటలు, మూడు పెద్ద ప్రాకారాలను కలిగిరి సువిశాలమైన ప్రాంగణంలో కొలువై ఉంది.
ఈ ఆలయంలో కొలువై ఉన్న కమలాంబికా అమ్మవారు ఏ ఇతర ఆలయంలో దర్శనమివ్వని విధంగా అమ్మవారు కాలు మీద కాలు వేసుకుని ఎంతో ఠీవిగా భక్తులకు దర్శనం కల్పిస్తుంటారు.

ఈ ఆలయంలోని కోనేరులో కొలువై ఉన్న వాల్మీకనాథుడు అనే శివుడు ఒక పుట్టలో వెలసిన స్వామి అని,దేవతల ప్రార్థననుసరించి ప్రత్యక్షమైన ఈ స్వామికి ఏ విధమైన అభిషేకాలు ఉండవు.అదేవిధంగా ప్రతి శివాలయంలో శివునికి ఎదురుగా నంది మనకు కూర్చుని దర్శనమిస్తుంది.కానీ ఈ ఆలయంలో మాత్రం నంది ఎంతో ప్రత్యేకంగా భక్తులకు దర్శనమిస్తుంది.
ఈ ఆలయంలో వెలసిన నంది స్వామి పట్ల గౌరవ సూచికంగ నిలబడి భక్తులకు దర్శనం కల్పిస్తుంది.అదే విధంగా ఈ ఆలయంలోని మరొక ప్రత్యేకత ఏమిటంటే కొలను అని చెప్పవచ్చు.
ఈ ఆలయంలో ఉన్న కొలనునే కమలాలయం అని పిలుస్తారు.దేశంలోనే ఎంతో పెద్దదైన కొలనుగా ఇది ప్రసిద్ధి చెందింది.