విజయవాడ కనక దుర్గమ్మ దర్శన వేళల గురించి మీకు తెలుసా?

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన బెజవాడ కనక దుర్గమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కోరన కోర్కెలు తీర్చే ఈ అమ్మవారిని దర్శించుకోవాలని ఎంతో మంది భక్తులు ఆశగా ఎదురు చూస్తుంటారు.

 Do You Know About Vijayawada Kanaka Durgamma Darshan Timings , Bejawada Durgamma-TeluguStop.com

అయితే అలాంటి అమ్మవారి ఆలయంలో దర్శన సమయాలు ఎలా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

వేకువజామున 4 గంటల నుంచి 9 గంటల వరకు అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు.

మధ్యాహ్నం భోజన సమయంలో కాసేపు దర్శనాన్ని నిలిపివేస్తారు.తెల్లవారుజామున 4.30 గంటలకు ఖడ్గమాల పూజ ప్రారంభం అవుతుంది.ఈ సేవలో పాల్గొనే భక్తులు 516 రూపాయలు చెల్లించి ఉదయం 4 గంటలకు ఆలయానికి చేరుకోవాలి.

ఒక్క టిక్కెట్టుపై దంపతులకు అనుమతి ఉంటుంది.  మిగతా పూజలకు 516 రూపాయలు మాత్రమే.ఉదయం 9 గంటలనుంచి 11.30 గంటల వరకు జరుగుతాయి.ఒక టిక్కెట్టుపై దంపతులకు ప్రవేశం.ఈ పూజల కోసం ఉదయం 8 గంటలకే గుడికి చేరుకోవాల్సి ఉంటుంది.అయితే ప్రధానమైన పూజల్లో స్వర్ణపుష్ప పూజ ఒకటి.ప్రతి గురువారం సాయంత్రం 5.15 గంటల నుంచి 6.30 గంటల వరకు అమ్మవారి అంతరాలయంలో 108 స్వర్ణ పుష్పాలతో జరిగే ఈ పూజలో భక్తులు 2500 రూపాయలు చెల్లించి పాల్గొనవచ్చు.రోజూ సాయంత్రం 6 గంటల నుంచి 6.30 గంటల వరకు హారతుల సమయం.ఈ హారతులు తిలకించేందుకు 200 రూపాయ టిక్కెట్టు తీసుకుంటే ఇద్దరు చొప్పున అనుమతిస్తారు.అయితే స్థలాభావం కారణంగా 20 టిక్కెట్లను మాత్రమే విక్రయిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube