ధన త్రయోదశి రోజు ఇలా చేస్తే.. మీ ఇంట్లో ధనానికి లోటే ఉండదు..!

ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ధన త్రయోదశి పండుగను ప్రజలు జరుపుకుంటారు.ఈ మాసం విష్ణుమూర్తి పూజకు అంకితం చేయబడిందని చాలా మందికి తెలుసు.

 If You Do This On The Day Of Dhana Trayodashi.. There Will Be No Shortage Of Mo-TeluguStop.com

అందుకే ఈ మాసంలో తులసి పూజకు ఎంతో విశిష్టత ఉంది.ఈ రోజు తులసికి సంబంధించిన కొన్ని పరిహారాలు చేస్తే విష్ణుమూర్తి( Lord Vishnu) అనుగ్రహం పొందడంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

అలాగే డబ్బు సమస్యను ఎదుర్కొంటున్న వారు ఈ పరిహారాలు చేయాలి.మరి ఇందుకోసం ధన త్రయోదశి రోజు తులసికి ఎలాంటి పరిహారాలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Bhakti, Devotional, Dhana Triodasi, Goddess Lakshmi, Karthika Masam, Lord

ముఖ్యంగా చెప్పాలంటే తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.ఇది మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుంది.అందుకే ధన త్రయోదశి రోజు ( Dhana Trayodashi day )తులసి ఆకుల రసాన్ని తాగడం శుభప్రదంగా భావిస్తారు.ఇది మన ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా మీకు సంపదను కూడా తెచ్చిపెడుతుంది.

అలాగే జీవితంలో సంతోషాన్ని శ్రేయస్సును కలిగిస్తుంది.అంతే కాకుండా ఇది మీ జీవితాన్ని సంతోషకరంగా మారుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే ధన త్రయోదశి రోజు మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద తులసి మొక్కను పెట్టాలి.అలాగే మరిచిపోకుండా తులసి మొక్క దగ్గర దీపాన్ని వెలిగించాలి.

ఇంకా చెప్పాలంటే ధన త్రయోదశి రోజు మాత్రమే ఇలా చేయాలని కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి.

Telugu Bhakti, Devotional, Dhana Triodasi, Goddess Lakshmi, Karthika Masam, Lord

ఆ తర్వాత రాత్రి కాకముందే తులసి మొక్కను తిరిగి ఇంట్లో పెట్టాలి.దీని వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి ( Goddess Lakshmi )వస్తుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు.ముఖ్యంగా చెప్పాలంటే ధన త్రయోదశి రోజు తులసి మొక్కకు సంబంధించిన ఈ పనులు చేయడం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

అలాగే ఈ రోజు ఇంటికి జమ్మి మొక్కను తీసుకురావడాన్ని కూడా పవిత్రంగా భావిస్తారు.ఇలా జమ్మి మొక్కను ఇంటికి తీసుకొని వస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని కూడా చెబుతున్నారు.

అలాగే అమ్మవారి అనుగ్రహం కూడా మీ కుటుంబ సభ్యులపై ఉంటుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube