మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు విభూతి కనబడుతుంది.ఈ విధంగా విభూతిని కొందరు నుదిటిపై పెట్టుకోగా మరికొందరు వళ్ళంతా రాసుకుంటారు.
అదే విధంగా మరి కొందరు విభూదిని నోట్లోకి వేసుకోవడం మనం చూస్తుంటాము.అసలు ఇది ఎలా తయారు చేస్తారు ఈ విధంగా విభూతికి ఎందుకంత ప్రాధాన్యత కల్పించారు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మనం ఆలయాలలో చేసే హోమాలలో ఎంతో పవిత్రమైన దర్భలు, హోమ వస్తువులు, నెయ్యి వేసి హోమం చేస్తాము.ఈ విధంగా హోమంలోకి వేసిన వస్తువులు బస్మం కాగా ఏర్పడిన బూడిదను విభూది అంటారు.
విభూతి అంటే పరమశివుడికి ఎంతో ప్రీతికరం.ఈ క్రమంలోనే శివాలయంలో మనకు పెద్ద మొత్తంలో విభూతి అందుబాటులో ఉంచుతారు.
శివాలయానికి వెళ్లిన భక్తులు అదేవిధంగా శివ భక్తులు విభూతి నుదుటి పై మాత్రమే కాకుండా భుజాలపై వక్ష స్థలాలపై ఉదరం పై విభూదిని రాసుకుని ఉంటారు.

మనం ఏదైనా వస్తువులను కాల్చినప్పుడు మనకు చివరికి బూడిద వస్తుంది.కానీ బూడిదను కాల్చినప్పుడు కూడా మనకు చివరికి బూడిదే మిగులుతుంది.కనుక బూడిదకు ఏ విధమైనటువంటి మార్పు కానీ, నాశనం కానీ లేదు.
నాశనం లేని విభూతితో మార్పులేని ఆ పరమశివునికి పూజ చేసుకున్నాము.విభూతి కేవలం శాశ్వతమైంది, పవిత్రమైంది మాత్రమే కాదు ఆరోగ్యదాయిని కూడా.
సాధారణంగా ఎవరైనా జ్వరంతో బాధ పడుతుంటే వారిని నుదిటి పై తడి విభూతి రాయటం వల్ల శరీరంలోని ఉష్ణోగ్రతలు తొందరగా తగ్గుముఖం పడతాయి.అదేవిధంగా జ్వరము తలనొప్పి రాకుండా కాపాడుతుంది.
భస్మాన్ని నుదుట ధరించేటప్పుడు మృత్యుంజయ మంత్రము చెప్పాలని ఉపనిషత్తులు చెపుతున్నాయి.అందుకోసమే విభూతికి అంతటి ప్రాధాన్యత కలిగి ఉంది.