ఫన్ బకెట్ భార్గవ్ రేప్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు... 

దేశవ్యాప్తంగా మహిళల పై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన చట్టాలు మరియు శిక్షలు అమలులోకి తెచ్చినప్పటికీ మహిళలపై జరుగుతున్న ఆగడాలు మాత్రం ఆగడం లేదు.కాగా ఇటీవలే యూట్యూబ్ లో పలు వీడియోలు చేస్తూ ప్రేక్షకులను బాగానే అలరించిన సోషల్ మీడియా స్టార్ చిట్టాడ భార్గవ్ 14 సంవత్సరాలు కలిగినటువంటి ఓ బాలికను లైంగికంగా వేధించి చివరికి ఆమెను గర్భవతిని చేసిన ఘటన అందరికీ తెలిసిందే.

 Tik Tok Fame Omg Nithya Clarify About Pregnancy Rumors', Pregnancy Rumors, Omg N-TeluguStop.com

దీంతో ఇటీవలే భార్గవ్ పోలీసులు దిశ యాక్ట్ చట్టం కింద అరెస్టు చేసి పలు సెక్షన్ల తో కేసు కూడా నమోదు చేశారు.కాగా తాజాగా ఈ విషయంపై గతంలో భార్గవ్ తో కలిసి వీడియోలు చేసినటువంటి చైల్డ్ ఆర్టిస్ట్ OMG నిత్య తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా స్పందించింది.

ఇందులో భాగంగా కొందరు తనకి భార్గవ్ ఇరుక్కున్నటువంటి కేస్ కి తనకి సంబంధం ఉందని అనుకుంటున్నారని అందులో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేసింది.అంతే కాకుండా తన గురించి కొంతమంది సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ చేస్తున్నారని కాబట్టి వాటిని డిలీట్ చేయాలని కోరింది.

అలాగే తనకి సంవత్సరం క్రితం నుంచి భార్గవ్ తో ఎలాంటి కాంటాక్ట్ లేదని తాను ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నానని చెప్పుకొచ్చింది.

అయితే ఈ విషయం అందరిలాగే తనకి కూడా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెలిసిందని తెలిపింది.

అలాగే తాను ప్రస్తుతం క్షేమంగానే ఉన్నానని తనతో పాటు సినిమా షూటింగులకి తన తల్లి కూడా తన వెంట హాజరు అవుతుందని తన శ్రేయోభిలాషులకి సెలవిచ్చింది.అంతేకాకుండా మరికొంతమంది నెగిటివ్ ట్రోలర్స్ కి కూడా దయచేసి తనకు ఏమాత్రం సంబంధం లేనటువంటి ఈ కేసులో కి తనని లాగడం మరియు ముడిపెట్టి ప్రచారాలు చేయడం వంటివి చేయొద్దని కూడా కోరింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా సంవత్సరం క్రితం నిందితుడు భార్గవ్ టిక్ టాక్ మరియు యూట్యూబ్ లో బాగా పాపులర్ అయిన ఫన్ బకెట్ వంటి కార్యక్రమాల్లో నటిస్తూ బాగానే పాపులర్ అయ్యాడు.అందువల్లే 14 సంవత్సరాల కలిగినటువంటి బాలిక తనని సంప్రదించడంతో ఆమెని పలుమార్లు బలవంతంగా లొంగదీసుకుని అత్యాచారం చేసి చివరికి గర్భవతిని చేశాడని నిందితురాలు తల్లి ఆరోపిస్తోంది.

దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.అంతేకాకుండా అవగాహన లేని వయసులో కలిగేటువంటి కోరికలను అదుపు చేసుకోలేక పోవడంతో మరికొందరు వాటిని అలుసుగా తీసుకొని ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.

దీంతో అభం శుభం తెలియని 14 సంవత్సరాల చిన్నారిని గర్భవతిని చేసినందుకుగాను భార్గవ్ ని దారుణంగా శిక్షించాలని కొందరు కోరుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube