వేప విత్తనాలతో చేసిన చూర్ణంతో.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

వేప( neem ) ప్రాచీన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం వేప అనేది అన్ని ఔషధాల్లో కెల్లా రారాజు అని చెప్పవచ్చు.వేపలో ఎన్నో నమ్మలేని ఔషధ గుణాలు ఉన్నాయి.

 Do You Know How Many Health Benefits Of Neem Seed Powder , Neem, Neem Seed Powd-TeluguStop.com

ఆ ఔషధ గుణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.వేపాకు క్యాన్సర్ కణాలను నశించడంలో సహాయపడుతుంది.

అలాగే శరీరంలో హానికరమైన బ్యాక్టీరియా కూడా నాశనం చేయడంలో వేపాకు సహాయపడుతుంది.అయితే స్నానం చేసే ముందు వేపాకుతో పేస్ట్ చేసుకుని శరీరానికి అంతా రుద్ది ఆరాక స్నానం చేస్తే అది యాంటీ బ్యాక్టీరియల్( Anti bacterial ) గా పనిచేస్తుంది.

దీంతో మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.అయితే చాలామంది ఎన్నో చర్మ సమస్యలతో బాధపడుతూ ఉంటారు.

Telugu Acne, Bacterial, Black Spots, Diabetes, Benefits, Tips, Neem-Telugu Healt

మొహం మీద కూడా మొటిమలు, నల్ల మచ్చలు ( Acne, black spots )లాంటివి వస్తూ ఉంటాయి.ఇక శరీరంలో కూడా చాలామందికి వేడి వలన అలాగే ఎక్కువగా బయట ఫుడ్స్ తినడం వలన ఎలర్జీ, పింపుల్స్ వస్తూ ఉంటాయి.అయితే అలాంటి వాళ్ళు వేపాకులను పేస్టులాగా తయారు చేసుకుని స్నానం చేసే పది నిమిషాల ముందు వేపాకు పేస్టును ఒళ్లంతా, మొహమంత రాసుకొని ఒక పదినిమిషాలు ఉండి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే మీ చర్మ ఆరోగ్యం బాగుంటుంది.ఇలా తరచుగా చేయడం వలన చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

అంతేకాకుండా వేప జ్యూస్ తాగడం వలన జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.

Telugu Acne, Bacterial, Black Spots, Diabetes, Benefits, Tips, Neem-Telugu Healt

ఈ మధ్యకాలంలో చాలామంది మధుమేహం వ్యాధితో( diabetes ) బాధపడుతూ ఉన్నారు.అయితే మధుమేహం వ్యాధిని నిరోధించడంలో కూడా వేప బాగా సహాయపడుతుంది.అయితే వేప రసంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ ఎంజైమ్ లు పుష్కలంగా లభిస్తాయి.

అంతే కాకుండా వేప విత్తనాలు నల్లగొట్టి మంచినీటిలో కలిపి వడగట్టి రసం తాగితే కడుపులో ఉన్న పురుగులు కూడా నశించిపోతాయి.ఇక దంత సమస్యలతో బాధపడుతున్న వారు కూడా ఆ సమస్యలు నయం చేయడానికి వేప బెరడును ఉపయోగిస్తే అద్భుతంగా పనిచేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube