పొడి చర్మం లేదా డ్రై స్కిన్ స్త్రీలు, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది ఈ సమస్యతో బాధ పడుతుంటారు.కఠినమైన సబ్బులు వాడకం, కెమికల్స్ ఎక్కువగా ఉండే క్రీములు పూసుకోవడం, ఆహారపు అలవాట్లు, వాతావరణంలో మార్పులు, పోషకాల లోపం, కాలుష్యం ఇలా రకరకాల కారణాల వల్ల చర్మం పొడిగా మారిపోతుంటుంది.
దాంతో చర్మాన్ని ఎలా మృదువుగా, తేమగా మార్చుకోవాలో తెలియక తెగ సతమతమవుతుంటారు.అయితే పొడి చర్మానికి చెక్ పెట్టడంలో లావెండర్ ఆయిల్ అద్భుతంగా సహాయపడుతుంది.
మరి లావెండర్ ఆయిల్‌ను ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మూడు, నాలుగు చుక్కల లావెండర్ ఆయిల్, అవకాడో పండు గుజ్జు వేసి మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి పూసి ఇరవై నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి.అనంతరం చల్లటి నీటితో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా రోజుకు ఒక సారి చేస్తే పొడి బారిన చర్మం తేమగా, మృదువుగా మారుతుంది.
అలాగే ఒక బౌల్‌లో రెండు స్పూన్ల ఆరెంజ్ పీల్ పౌడర్, పావు స్పూన్ లావెండర్ ఆయిల్ మరియు ఒక స్పూన్ తేనె వేసి కలుపు కోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి పావు గంట పాటు వదిలేయాలి.ఆ తర్వాత కూల్ వాటర్‌తో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.
డే బై డే ఇలా చేస్తే డ్రై స్కిన్ సమస్య దూరం అవుతుంది.
ఇక పైన చెప్పుకున్న టిప్స్ తో పాటు పొడి చర్మ తత్వం కలవారు వాటర్ ఎక్కువగా తీసుకోవాలి.
అధిక సార్లు ఫేస్ వాష్ చేసుకోవడం మానుకోవాలి.స్నానం తర్వాత ఖచ్చితంగా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి.
తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాలి.తాజా పండ్లు, నట్స్, ఆకుకూరలు డైట్‌లో చేర్చుకోవాలి.
తద్వారా డ్రై స్కిన్ తేమగా, కొమలంగా మారుతుంది.