1.ఏపీ అసెంబ్లీ లో ఐదుగురు టిడిపి సభ్యుల సస్పెన్షన్
ఏపీ అసెంబ్లీ లో ఐదుగురు టిడిపి సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు.
2.సీఎస్ సోమేష్ కుమార్ కేసులపై సీజేఐ కి బీజేపీ ఎమ్మెల్యే ఫిర్యాదు
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ రిట్ పిటిషన్ ను వెంటనే విచారణ చేయాలని కోరుతూ, బిజెపి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కు లేఖ రాశారు.
3.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,503 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
4.ఎంపీ పదవికి భగవంత్ మాన్ రాజీనామా
పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది.ఆ పార్టీ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈనెల 16న ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో సంగ్రూర్ జిల్లాలోని దురి స్థానం నుంచి ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు.ఈ నేపథ్యంలోనే ఆయన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నారు.
5.కేంద్రంపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం
తెలంగాణపై కేంద్రం తీవ్ర వివక్ష చూపుతోందని 150 మెడికల్ కాలేజీలు కేంద్రం ప్రకటిస్తే, అందులో తెలంగాణకు ఒక్కటి కూడా కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
6.బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై హైకోర్టులో విచారణ
తెలంగాణ అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది.
7.జె ఎన్ టి యు విద్యార్థినికి అవార్డు
తక్కువ ఖర్చుతో నీటిని శుద్ధి చేయడం పై పరిశోధన చేసిన జేఎన్టియు విద్యార్థిని పి.నాన్సీ సంయుక్త కు ప్రఖ్యాత లీలావతి అవార్డు దక్కింది.
8.తెలంగాణ శాసనమండలి చైర్మన్ గా గుత్తా
తెలంగాణ శాసనమండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
9.తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆరోజు ప్రారంభమయ్యాయి.
10.నేడు బండ్లగూడలో రెండో ప్రీ బిడ్ సమావేశం
నాగోల్ సమీపంలోగల బండ్లగూడ రాజు స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ కు సంబంధించిన 15 అపార్ట్మెంట్ టవర్ల అమ్మకాల పై సోమవారం రెండో దశ మీటింగ్ నిర్వహించనున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.
11.చంద్రబాబు పై ఏపీ మంత్రి కామెంట్స్
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జంగారెడ్డిగూడెం పలకరింపు లకు వెళ్లారా లేక బలప్రదర్శనకు వెళ్ళారా ? అక్కడి సాధారణ మరణాలను టిడిపి కల్తీ మద్యం మరణాలు గా చిత్రీకరిస్తోందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని విమర్శించారు.
12.విశాఖలో బ్రదర్ అనిల్ కుమార్ పర్యటన
విశాఖ నగరంలో బ్రదర్ అనిల్ కుమార్ పర్యటిస్తున్నారు.అనేక మిషనరీ సంస్థలు, వివిధ సంఘాల నేతలతో ఆయన సమావేశం అయ్యారు.ఈయన పర్యటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
13.పరిటాల సునీత నిరసన
రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి పరిటాల సునీత రామగిరి మండల కేంద్రంలో 100 ట్రాక్టర్లతో రైతులతో కలిసి తాసిల్దార్ ఆఫీస్ ముందు నిరసన చేపట్టారు.
14.స్పీకర్ కు మరోసారి గంటా లేఖ
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కు విశాఖ టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు లేఖ రాశారు.తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
15. రైతులకు అండగా బిజెపి
రైతులకు అండగా బీజేపీ పోరాటం చేస్తుంది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రప్రకటించారు.
16.మందు పాతర పేల్చిన మావోయిస్ట్ లు
ఛత్తీస్ ఘడ్ లో మావోయిస్ట్ లు మందుపాతర పేల్చారు.
17.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం గా కొనసాగుతోంది ఆదివారం తిరుమల శ్రీవారిని 74,167 మంది భక్తులు దర్శించుకున్నారు.
18.షర్మిల పాదయాత్ర
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం యాత్ర 25వ రోజుకు చేరుకుంది.
19.వేములవాడ లో భక్తుల రద్దీ
దక్షిణ కాశీగా వేములవాడ భక్తుల రద్దీ పెరిగింది.సదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 48,100
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 52, 470
.