సాధారణంగా కొందరి శరీరం తెల్లగా, మృదువుగా, కోమలంగా మెరిసిపోతూ ఉంటుంది.కానీ.
చేతులు, పాదాలు మాత్రం రఫ్‌గా, అందవిహీనంగా కనిస్తుంటాయి.దాంతో కాస్త ధనవంతులైతే చేతులను, పాదాలను మృదువుగా మార్చుకోవడం కోసం తరచూ బ్యూటీ పార్లర్‌కి వెళ్లి పెడిక్యూర్, మానిక్యూర్ చేయించుకుంటారు.
కొందరు మాత్రం బ్యాటీ పార్లర్‌లో వేలకు వేలు ఖర్చు పెట్టలేక ఇంట్లోనే రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు.అయితే ఇలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ ఎఫెక్టివ్ చిట్కా అద్భుతంగా సహాయపడుతుంది.
మరి ఆ చిట్కా ఏంటో ఆలస్యం చేయకుండా ఓ చూపు చూసేయండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాటర్ పోయాలి.
వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్ వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి.ఇప్పుడు స్ట్రైనర్ సాయంతో కాఫీ డికాక్షన్‌ను సపరేట్ చేసుకోవాలి.
ఈ డికాక్షన్ కూల్ అయ్యేలోపు హాఫ్ డావ్ సోప్ ను తీసుకుని సన్నగా తురుముకోవాలి.
ఆ తర్వాత చల్లారిన కాఫీ డికాక్షన్‌లో వన్ టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని చిన్న మంటపై దగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.ఇక చివరిగా ఇందులో డావ్ సోప్ తురుము, వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసి కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి.
ఆపై ఈ మిశ్రమాన్ని చేతులకు, పాదాలకు అప్లై చేసి అర గంట పాటు వదిలేయాలి.

అనంతరం స్క్రబ్ చేసుకుంటూ గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇప్పుడు తడి లేకుండా చేతులను, పాదాలను టవల్‌తో తుడుచుకుని.ఏదైనా మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
ఇలా రెండు, మూడు రోజులకు ఒక సారి చేస్తే చేతులు, పాదాలు మృదువుగా, కోమలంగా తయారు అవుతాయి.