సినిమా ఇండస్ట్రీలో నటుడిగా గుర్తింపు పొందడం అనేది అంత ఈజీ అయిన విషయం ఏమీ కాదు.దానికోసం చాలా రకాలుగా కష్టపడాల్సి ఉంటుంది ఇదిలా ఉంటే బాలనటులుగా ఇండస్ట్రీకి వచ్చి తనదైన నటనతో మెప్పించి ఆ తర్వాత హీరోగా కూడా వచ్చి ఇండస్ట్రీలో స్థిరపడిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు.
అందులో కమల్ హాసన్, శ్రీదేవి లాంటి వారిని ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు.వీళ్లు హీరోలుగా,హీరోయిన్లుగా మారి ఇండస్ట్రీలో తనదైన మార్కు నటనతో ఇండస్ట్రీ మొత్తం తమ వైపు తిప్పుకొని,కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీని ఏలిన ఆర్టిస్టులు.
మీన, రాశి లాంటి వారు కూడా ఇండస్ట్రీలో బాలనటులుగా వచ్చి తర్వాత హీరోయిన్స్ గా మారి ఇండస్ట్రీలో తమ నటనతో తనదైన గుర్తింపును సాధించారు.వీళ్లు ఇలా ఉంటే ఇంకొందరు మాత్రం బాలనటులుగా వచ్చి ఆ తర్వాత సినిమాల్లో కనిపించక కనుమరుగైపోతున్నారు.
అలాంటి వాళ్ళ లో స్వాతి ముత్యం లో బాల నటుడిగా నటించి మెప్పించిన కార్తీక్ ఒకరు.ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలుసుకుందాం.
కె.విశ్వనాధ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా రాధిక హీరోయిన్ గా వచ్చిన స్వాతిముత్యం సినిమా అప్పట్లో ఎంతటి విజయం సాధించిందో మనందరికీ తెలుసు.విలక్షణ నటుడు అయిన కమల్ హాసన్ ఎన్నో సినిమాల్లో అద్భుతమైన నటనను కనబరిచారు.కళాతపస్వి అయిన కె.
విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్ సినిమా అంటే జనాల్లో ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా ఉండేవి ఒక విధంగా చెప్పాలంటే కమల్ హాసన్ ని అద్భుతమైన నటుడు అనడానికి దానికి కారణమైన వ్యక్తుల్లో విశ్వనాథ్ గారు ఒకరు.ఎందుకంటే ఒక క్యారెక్టర్ ని రాసుకుని ఆ క్యారెక్టర్ ని కమల్ హాసన్ అయితే బాగా చేయగలడు అని అనుకొని ఆయన చేత చేయించి, ఆయన నటన ప్రతిభను బయట తీసిన ఘనత మాత్రం విశ్వనాధ్ గారికి చెందుతుంది.
అలా వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చాలా సినిమాల్లో స్వాతిముత్యం ఒకటీ.ఈ సినిమాలో కమల్ హాసన్ మానసికంగా పరిణితి చెందని మైండ్ కలవాడిగా తన నటనతో మంచి గుర్తింపు సాధించాడు.
అలాంటి కమల్ హాసన్ తో పోటీపడి నటిస్తూ మన అందరి చేత శభాష్ అనిపించుకున్న బాలనటుడు ఎవరు అంటే కార్తీక్ అని చెప్పాలి.
కార్తీక్ కూడా తన చిట్టి పొట్టి మాటలతో ఆడియన్స్ అందరిని ఎట్రాక్ట్ చేశాడు, సినిమా విజయంలో తనవంతు పాత్రని పోషించాడు.అయితే ఈ సినిమాలో రాధిక కి ముందే పెళ్లి అయి ఒక పిల్లాడు ఉంటాడు ఆ పిల్లాడు గా కార్తీక్ నటించిన తీరు అద్భుతమనే చెప్పాలి.కార్తీక్ ఆ సినిమా తర్వాత మళ్లీ ఏ సినిమాలోనూ నటించలేదు.
ఆయన ఎవరు అంటే అప్పట్లో జానపద చిత్రాలకు పెట్టింది పేరుగా సినిమాల్లో నటించి అందరి చేత చప్పట్లు కొట్టించిన నటుడు కాంతారావు గారి మనవడు.కాంతారావు తన తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా ఒకరు ఉండాలి అనే ఉద్దేశంతో తన మనవడితో స్వాతిముత్యం సినిమాలో చిన్న పిల్లాడి క్యారెక్టర్ చేయించాడు.
ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ కార్తీక్ మాత్రం సినిమాల్లో నటించలేదు. అమెరికా వెళ్లి అక్కడే చదువుకొని మొన్నీమధ్య ఇండియాకి వచ్చి రమ్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇండియాలోనే స్థిరపడ్డాడు.
ప్రస్తుతం బిజినెస్ కు సంబంధించిన పనులు చూసుకుంటూ బిజీగా ఉన్నాడు.అదే కాంతారావు ఎంత పెద్ద స్టార్ హీరోగా వెలుగొందాడు అనేది మనందరికీ తెలుసు, అలాంటి కాంతారావు నట వారసుడిగా ఇండస్ట్రీ లో తను కూడా హీరోగా ఎంట్రీ ఇస్తాడు అని అందరూ అనుకున్నారు, కానీ తనకు అలాంటి ఆలోచన లేదు అనే ఉద్దేశంతో బిజినెస్ చూసుకుంటూ తన పనిలో తను నిమగ్నమైపోయాడు.