గ్యాస్ ట్రబుల్.సర్వ సాధారణంగా వేధించే సమస్యల్లో ఇది ఒకటి.
వేళకు ఆహారం తీసుకోకపోవడం, ఒత్తిడి, అధికంగా టీ-కాఫీలు సేవించడం, ఎక్కువ సేపు ఒకేచోట కూర్చోవడం, ఆహారం నమలకుండా తినేయడం, జీర్ణకోశంలో ఇన్‌ఫెక్షన్ ఏర్పడటం వంటి రకరకాల కారణాల వల్ల గ్యాస్ తరచూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది.ఇది చిన్న సమస్యే అయినప్పటికీ.
తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తుంది.అయితే అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను తీసుకుంటే క్షణాల్లో గ్యాస్ సమస్య నుంచి రిలీఫ్ పొందొచ్చు.
మరి లేటెందుకు ఆ డ్రింక్ ఏంటో.ఎలా తయారు చేసుకోవాలో.
తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర, ఐదు మిరియాలు, ఎండిన అల్లం ముక్క చిన్నది వేసి స్లో ఫ్లేమ్ పై రెండు నుంచి ముడు నిమిషాల పాటు వేయించుకోవాలి.
ఇలా వేయించుకున్న వాటిని పూర్తిగా చల్లారబెట్టుకుని మిక్సీ జార్‌లో వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, ఆఫ్ టేబుల్ స్పూన్ ఛాట్ మసాలా, పావు టేబుల్ స్పూన్ ఇంగువ, పావు టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్, పావు టేబుల్ స్పూన్ నార్మల్ సాల్ట్ కూడా మిక్సీ జార్‌లో వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి.
ఈ పొడిని ఒక బాక్స్‌లో వేసి స్టోర్ చేసుకోవాలి.

ఇక ఈ పొడితోనే గ్యాస్ ట్రబుల్ ను నివారించే డ్రింక్ ను తయారు చేసుకోబోతున్నాము.ఒక బౌల్ తీసుకుని అందులో చిన్న లెమన్ స్లైస్, నాలుగు పుదీనా ఆకులు, తొక్క తొలగించిన చిన్న అల్లం ముక్క వేసి కచ్చ పచ్చగా దంచాలి.అపై అందులో తయారు చేసి పెట్టుకున్న జీరా పౌడర్ వన్ టేబుల్ స్పూన్, రెండు టేబుల్ స్పూన్ల పటిక బెల్లం పొడి, రెండు టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్, రెండు-మూడు ఐస్ క్యూబ్స్, ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే సూపర్ టేస్టీ జల్జీరా డ్రింక్ సిద్ధం అవుతుంది.
గ్యాస్ సమస్య వేధిస్తున్నప్పుడు ఈ డ్రింక్‌ను తాగితే వెంటనే దాని నుంచి ఉపశమనం పొందుతారు.