అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తన దూకుడైన నిర్ణయాలతో ప్రపంచానికి షాకులిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్.( President Donald Trump ) ముఖ్యంగా ఇమ్మిగ్రేషన్ విషయంలో కఠిన నిబంధనలతో వలసదారులను వణికిస్తున్నారు.ఎప్పుడు? ఏ బాంబు పేల్చుతారో తెలియక అమెరికాలో ఉన్న విదేశీయులు, అంతర్జాతీయ విద్యార్ధులు బిక్కుబిక్కుమంటున్నారు.తాజాగా విదేశీ వలసదారుల కోసం ట్రంప్ కొత్త నిబంధన తీసుకొచ్చారు.
అమెరికాలో( America ) నివసిస్తున్న వలసదారులు ఫెడరల్ ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవడంతో పాటు 24 గంటలూ రిజిస్ట్రేషన్ పత్రాలను తమ వెంట ఉంచుకోవాలి.లక్షలాది మంది వలసదారులు ఫెడరల్ ప్రభుత్వంలో నమోదు చేసుకోవాలని కోరుతూ డొనాల్డ్ ట్రంప్ పరిపాలన యంత్రాంగం శుక్రవారం యూఎస్ డిస్ట్రిక్ట్ న్యాయమూర్తి నుంచి ఆమోదం పొందింది.

కోర్టు ఉత్తర్వుల తర్వాత.డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ( Department Of Homeland Security ) కీలక ప్రకటన జారీ చేసింది.దీని ప్రకారం.18 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న అమెరికా పౌరులు కానీ వారంతా రిజిస్ట్రేషన్ పత్రాలను ఎల్లప్పుడూ తమ వెంట ఉంచుకోవాలని సూచించింది.మా దేశంలో చట్టవిరుద్ధంగా ఉన్న వారికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నేను స్పష్టమైనప సందేశాన్ని ఇస్తున్నానని డీహెచ్ఎస్ కార్యదర్శి క్రిస్టి నోయెమ్( Kristi Noem ) అన్నారు.
చట్ట విరుద్ధంగా ఉంటున్న వారు ఇప్పుడే వెళ్లిపోండి.అలా అయితే భవిష్యత్తులో అమెరికా కల నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని క్రిస్టి తెలిపారు.
మా మాతృభూమి, అమెరికన్ల భ్రదత కోసం దేశంలో ఎవరు ఉంటున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని డీహెచ్ఎస్ కార్యదర్శి పేర్కొన్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో చెల్లుబాటయ్యే వీసాలు, గ్రీన్‌కార్డులు, బోర్డర్ క్రాసింగ్ వీసాలు, ఐ-94 అడ్మిషన్ రికార్డులు ఉన్న వారితో సహా అన్ని వలసదారులు వారి రిజిస్ట్రేషన్ పత్రాలను 24 గంటలూ వెంట ఉంచుకోవాలి.వీరిలో హెచ్ 1 బీ వీసాలు,( H-1B Visa ) గ్రీన్‌కార్డులు( Green Card ) ఉన్న భారతీయులు కూడా ఉన్నారు.అమెరికన్ పౌరులు కానీ వారు, అమెరికాలో నివసిస్తున్న వ్యక్తులు, చట్ట విరుద్ధంగా ఉంటున్న వారిని ఫెడరల్ ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవాలని ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ చట్టం చాలా కాలంగా కోరుతోంది.