టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న దర్శకులలో సంపత్ నంది( Sampath Nandi ) ఒకరు.సాయితేజ్( Saitej ) హీరోగా సితార బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది.
పోలీసుల నుంచి నోటీసులు రావడం వల్ల ప్రధానంగా ఈ ప్రాజెక్ట్ వాయిదా పడి ందనే సంగతి తెలిసిందే.అయితే ఓదెల2( Odela 2 ) ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాకు సంబంధించి సంపత్ నంది అప్ డేట్స్ ఇచ్చారు.
గాంజా శంకర్( Gaanja Shankar ) సినిమాకు టైటిల్ తోనే చిక్కొచ్చి పడిందని ఆయన తెలిపారు.నిజానికి గంజాయికి వ్యతిరేకంగా ఈ సినిమా కథను రాసుకున్నానని సంపత్ నంది పేర్కొన్నారు.
హీరో ఎలా గంజాయిని అరికట్టాడనే కథాంశంతో ఆ సినిమా తెరకెక్కిందని ఆయన తెలిపారు.టైటిల్ మార్చి కథలో చిన్నచిన్న మార్పులు చేస్తానని ఆయన వెల్లడించారు.అది మోడ్రన్ స్క్రిప్ట్ అని ఎప్పుడైనా తెరకెక్కించొచ్చని ఆయన తెలిపారు.

పవన్ కోసం ఒక సినిమాకు సంబంధించి బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేశానని సంవత్సరం పాటు ఆ ప్రాజెక్ట్ తో ట్రావెల్ చేసినా ఆ సినిమాను నేను చేయలేకపోయానని ఆయన తెలిపారు.పవన్ తో సినిమా ఆగిపోవడానికి తగిన కారణాలు ఇప్పటికీ తన దగ్గర అయితే లేవని సంపత్ నంది చెప్పుకొచ్చారు.సంపత్ నంది చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

ఓదెల2 సినిమాకు సంపత్ నంది దర్శకత్వ పర్యవేక్షణ చేయగా ఈ సినిమా కలెక్షన్ల విషయంలో సైతం రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.సంపత్ నంది రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే.త్వరలో సంపత్ నంది కొత్త ప్రాజెక్ట్స్ గురించి క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.సంపత్ నందిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.