1.కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలో చేరిక

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి ముఖ్యమంత్రి గా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో బిజెపిలో చేరారు.
2.లోకేష్ పాదయాత్రలో బాలకృష్ణ
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కొనసాగిస్తున్న యువ గళం పాదయాత్రలో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు.
3.ప్రధానికి భట్టి విక్రమార్క లేఖ

ప్రధాని నరేంద్ర మోదీ కి 30 ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాశారు.
4.బెయిల్ పై విడుదలైన బండి సంజయ్
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఈరోజు కరీంనగర్ జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు.
5.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.నేడు టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి ఒక రోజుకు పైనే సమయం పట్టే అవకాశం ఉన్నట్లు టీటీడీ వర్గాలు తెలిపాయి.
6.జైలు నుంచి ప్రధానికి సిసోడియా లేఖ
ఢిల్లీ లిక్కర్స్ క్యాంప్ కేసులో జైల్లో ఉన్న మాజీ డిప్యూటీ సీఎం మనీ సిసోడియా జైలు నుంచి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.ఇండియాకు చదువుకున్న ప్రధాని కావాలంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.
7.పవన్ కళ్యాణ్ పై రోజా కామెంట్స్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రజల్లో నమ్మకం లేదని ఏపీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు.
8.అమరావతి పేరుతో మోసం చేశారు
అమరావతి పేరుతో విజయవాడ ను మోసం చేశారని వైసీపీ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు.
9.జగన్ ను ఎవరు నమ్మడం లేదు

ఏపీ సీఎం జగన్ ప్రజలు నమ్మడం లేదని, జగన్ మారీచ జిత్తులు మళ్లీ ప్రారంభమయ్యాయని టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు.
10.భారత్ లో కరోనా
భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.
గత ఏడాది సెప్టెంబర్ తో పోలిస్తే మళ్లీ ఇప్పుడు గరిష్టంగా కేసులు పెరుగుతున్నాయి .గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 6050 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
11. బాలకృష్ణ విమర్శలు

వైసిపి ప్రభుత్వ పాలనపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శలు చేశారు.నవరత్నాల మాయలో పడి ఓటును వృధా చేసుకోవద్దని బాలకృష్ణ పిలుపునిచ్చారు.
12.టీఎస్పీఎస్సీ స్కాం పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.
13.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలవనున్న ఉద్యోగ సంఘాలు
నేడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఉద్యోగ సంఘాల నేతలు కలవనున్నారు .ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో నేటి నుంచి జరిగే ఉద్యమ కార్యాచరణ లేఖను ఉద్యోగ సంఘాలు ప్రధాన కార్యదర్శి కి ఇవ్వనున్నారు.
14.కెసిఆర్ పై ఈటెల రాజేందర్ కామెంట్స్
కెసిఆర్ సింగరేణి పదివేల కోట్ల అప్పుల్లోకి నెట్టారని హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శించారు.
15.ఏపీకి రావలసిందిగా మార్గదర్శి ఎండికి సిఐడి ఆదేశం

మార్గదర్శి కేసులో ఏపీ సిఐడి విచారణ ముగిసింది.అమరావతికి రావలసిందిగా సిఐడి అధికారులు ఆదేశించారు.
16.జగన్ గుడ్ ఫ్రైడే సందేశం
మానవాళి కోసం జీసస్ మహా త్యాగమే గుడ్ ఫ్రైడే అని వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ అన్నారు.
17.శ్రీవారి హుండీ ఆదాయం

మార్చి నెలలు శ్రీవారి హుండీ ఆదాయం 120.29 కోట్లుగా వచ్చినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.
18.తగ్గనున్న సిఎన్జి ధరలు
దేశవ్యాప్తంగా పిఎన్జి, సిఎన్జి గ్యాస్ ధరలు 11% తగ్గనున్నాయి.
19.మాస్క్ తప్పనిసరి

తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు బంధువులు వైద్యులు నర్సులు సిబ్బంది తప్పక మాస్క్ ధరించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 55,800
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 60,870
.