ఏ అభిమానికి అయినా సరే తమ అభిమాన హీరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ఎంతగానో ఆశపడుతుంటారు.అయితే నేటి రోజుల్లో అయితే యాభై రోజుల పంక్షన్ ఇక శతదినోత్సవ ఫంక్షన్స్ గురించి ఎక్కువగా పట్టించుకోవడం లేదు.
సినిమా ఎన్ని వసూళ్లు సాధించింది.ఎన్ని కోట్ల లాభాలు వచ్చాయి అన్నది మాత్రమే చూస్తున్నారు.
కానీ ఒకప్పుడు ఇలా వసూళ్లతో పాటు శతదినోత్సవ వేడుకలు ప్రతి సినిమా సూపర్ హిట్ అయింది అనేదానికి సూచికగా నిర్వహించేవారు.అయితే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఎంతో మంది హీరోలు తక్కువ సమయంలోనే శతదినోత్సవ వేడుకలు జరుపుకున్నారు.
కానీ మహేష్ బాబు అభిమానులు మాత్రం శత దినోత్సవ వేడుకల కోసం ఎంతో నిరీక్షణ గా ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇక ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జూనియర్ ఎన్టీఆర్, తరుణ్, ఉదయ్ కిరణ్ లాంటి హీరోలు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొన్ని రోజుల్లోనే సినిమాలతో సూపర్ హిట్ కొట్టి శతదినోత్సవ వేడుకలు జరుపుకున్నారు.ఈ క్రమంలోనే సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు రాజకుమారుడు సినిమాతో పరిచయం అయ్యాడు మహేష్ బాబు.
ఇక ఈ సినిమా సూపర్ హిట్ వంద రోజులు కూడా పూర్తి చేసుకుంది.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది అయితే ఈ సినిమా ప్రొడ్యూసర్ గా ఉన్న అశ్వినీ దత్ కు 100 రోజుల ఫంక్షన్ నిర్వహించే అలవాటు లేదు.
దీంతో సినిమా హిట్ అయినా 100 రోజుల ఫంక్షన్ మాత్రం జరగలేదు.ఆ తర్వాత వచ్చిన యువరాజు, వంశీ చిత్రాలు అట్టర్ ఫ్లాప్ గా మిగిలిపోయాయ్.దీంతో అభిమానులకు మరింత నిరాశే ఎదురైంది.అటు వెంటనే కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి సినిమా సూపర్ హిట్.ఇక వంద రోజులు కూడా పూర్తి చేసుకుంది.కానీ ఇక ఈ సినిమా నిర్మాత తో మహేష్ బాబుకు విభేదాలు రావడంతో 100 రోజుల ఫంక్షన్ నిర్వహించలేదు.
ప్రేక్షకులకు నిరాశే ఎదురయింది.ఆతర్వాత టక్కరి దొంగ, బాబీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలు నిరాశ పరిచాయ్.
అలాంటి సమయంలోనే గుణశేఖర్ దర్శకత్వంలో 17 కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమా ఒక్కడు.సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాయడమే కాదు మహేష్ అభిమానుల శతదినోత్సవ వేడుక నిరీక్షణ కూడా తీర్చింది.
ఒక్కడు శతదినోత్సవ వేడుకలకు సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రభాస్ సహా మరికొంత మంది సెలబ్రిటీలు హాజరయ్యారు.