యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతోమంది అభిమానిస్తారు.మూడున్నరేళ్లుగా తారక్ సినిమా ఏదీ విడుదల కాకపోవడంతో ఎన్టీఆర్ అభిమానులు ఆర్ఆర్ఆర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఓవర్సీస్ లో ఎన్టీఆర్ అభిమానులు ఆర్ఆర్ఆర్ కోసం ఏకంగా థియేటర్లను బుకింగ్ చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.పర్ఫామెన్స్ పరంగా ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ఆర్ఆర్ఆర్ నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
సోషల్ మీడియాలో తారక్ ఎక్కువగా యాక్టివ్ గా ఉండకపోయినా ఈ స్టార్ హీరోకు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో అభిమానులు ఉన్నారు.ఈ టాలీవుడ్ స్టార్ హీరో ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా హీరోగా ఎదగటం గ్యారంటీ అని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.ఈ టాలీవుడ్ టాలెంటెడ్ హీరోకు ట్విట్టర్ లో ఏకంగా 5.7 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.అయితే ఈ టాలీవుడ్ హీరో మాత్రం కేవలం దర్శకధీరుడు రాజమౌళిని మాత్రమే ఫాలో అవుతున్నారు.
ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఎదగడంలో దర్శకధీరుడు రాజమౌళి పాత్ర ఎంతో ఉంది.
కెరీర్ తొలినాళ్లలో ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు తారక్ కెరీర్ కు ప్లస్ అయ్యాయి.అటు రాజమౌళికి కూడా తారక్ అంటే ప్రేమాభిమానాలు ఉన్నాయి.
తన డైరెక్షన్ లో తెరకెక్కే సన్నివేశాలకు పూర్తిస్థాయిలో న్యాయం చేసే హీరో తారక్ అని రాజమౌళి గతంలో ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు.

మరోవైపు తారక్ తర్వాత సినిమా డైరెక్టర్ల జాబితాలో కొరటాల శివ, ప్రశాంత్ నీల్, బుచ్చిబాబు ఉన్నారు.ఈ డైరెక్టర్లలో ఎవరి సినిమా మొదట మొదలవుతుందో క్లారిటీ రావాల్సి ఉంది.సినిమాసినిమాకు క్రేజ్ ను పెంచుకుంటున్న తారక్ తర్వాత సినిమాలతో కూడా విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.
తారక్ 29వ సినిమాగా ఆర్ఆర్ఆర్ తెరకెక్కుతోంది.







