గర్భ ధారణ( Pregnancy ) సమయం అన్నది ఏ మహిళకైనా చాలా సున్నితమైన, చాలా ముఖ్యమైన సమయం అని చెప్పవచ్చు.ఎందుకంటే గర్భిణీ స్త్రీ లోపల ఒక శిశువు పెరిగి తొమ్మిది నెలల తర్వాత ప్రపంచంలోకి వస్తుంది.
అలాగే గర్భధారణ సమయంలో ప్రతి స్త్రీకి కూడా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి.అయితే గర్భధారణ సమయంలో స్త్రీ శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి.
ఈ మార్పులకు సంబంధించి చాలా మంది గర్భిణీ స్త్రీలు అయోమయంలో పడతారు.ప్రెగ్నెన్సీ సమయంలో బరువు పెరగడం( Weight Gain ) సహజమే.
అయితే చాలామంది ప్రశ్న ఏమిటంటే గర్భధారణ సమయంలో ఎంత బరువు పెరగడం సముచితం అని.అయితే మొదటిసారి తల్లులు అవుతున్న మహిళలు బరువు గురించి ఆందోళన చెందుతారు.ఆహారాన్ని కూడా నియంత్రిస్తారు.అయితే ఆహారం లేదా వ్యాయామం ద్వారా బరువు తగ్గడం గర్భిణి స్త్రీకి హానికరం.అందుకే గర్భిణీ స్త్రీ ఎంత బరువు పెరగడం సాధారణం అనేది తెలుసుకోవాలి.బరువు పెరగడానికి కారణం ఏమిటంటే, పిల్లల బరువు కూడా తల్లి శరీరంలో చేర్చబడుతుంది.
ఒకవేళ కడుపులో కవల పిల్లలు ఉంటే 15 నుండి 20 కిలోల బరువు పెరుగుతారు.
ఇలా కాకుండా గర్భిణి స్త్రీ రొమ్ము పరిమాణం పెరగడం, ప్లాసెంట పరిమాణం పెరగడం, గర్భాశయం పరిమాణం పెరగడం, శరీరంలో అదనపు రక్తం, నీటి శాతం కూడా పెరగడం వలన బరువు పెరుగుతారు.గర్భం దాల్చిన మొదటి మూడు నెలల నుండి స్త్రీ బరువు సాధారణంగా పెరుగుతూ ఉంటుంది.ఆ తర్వాత ప్రతి వారం ఒక కిలో వరకు పెరుగుతారు.
ఇది సహజమైనదే ఇందులో ఆందోళన చెందే విషయమేమీ లేదు.గర్భిణీ స్త్రీలలో బరువు 12 నుండి 16 కిలోల వరకు పెరుగుతూ ఉంటుంది.
అలాగే ఆరోగ్యవంతమైన మహిళల బరువు సుమారు 12 కిలోల వరకు పెరిగే అవకాశం ఉంది.