ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు.వైసీపీ ప్రభుత్వం రూ.13 లక్షల కోట్ల అప్పులు చేసిందన్న ఆయన అందులో బటన్ నొక్కి లక్షన్నర కోట్లే ప్రజలకు ఇచ్చారని ఆరోపించారు.ఈ క్రమంలో మిగిలిన పదకొండున్నర లక్షల కోట్లు ఏం చేశారని ప్రశ్నించారు.
రాష్ట్రంలో వైసీపీ సర్కార్ ఏం అభివృద్ధి చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.నాలుగేళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమి లేదని విమర్శించారు.