ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించి తమ జీవితాలను మెరుగుపరుచుకోవాలని బాగా కష్టపడతారు.కొందరైతే ఆఫీసుకు వెళ్లడానికి రోజూ గంటల తరబడి ప్రయాణాలు చేస్తుంటే, మరికొందరు వ్యాపారాలు( businesses ) అభివృద్ధి చేయడానికి రోజుకి 14 గంటలు పనిచేస్తారు.
ఇంత కష్టపడ్డా అందరికీ అదృష్టం వరించదు.కానీ కొందరు మాత్రం ఊహించని విధంగా అదృష్టవంతులవుతారు.
అలాంటి అదృష్టవంతుడి స్టోరీ ప్రస్తుతం వైరల్ గా మారింది.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి పాడుబడిన పాత ఇంటిని అన్వేషిస్తున్నాడు.
ఆ ఇల్లు చూస్తే ఎన్నో ఏళ్లుగా ఎవరూ పట్టించుకోలేదని అర్థమవుతోంది.ఒక చేతిలో మెటల్ డిటెక్టర్ ( Metal detector )పట్టుకుని, వెనుక ఒక కుక్కను తోడుగా తీసుకుని ఆ వ్యక్తి ఇంట్లోకి అడుగుపెట్టాడు.
గోడల్లో దాగున్న లోహాల కోసం వెతకడం మొదలుపెట్టాడు.ఇంతలో మెటల్ డిటెక్టర్ ఒక్కసారిగా ఒక స్తంభం దగ్గర బీప్ సౌండ్ చేయడం ప్రారంభించింది.
వెంటనే సదరు వ్యక్తి ఆ ప్రదేశాన్ని క్రాస్ గుర్తుతో మార్క్ చేసి, సుత్తితో స్తంభాన్ని బలంగా కొట్టడం మొదలుపెట్టాడు.
కొన్ని దెబ్బలు వేయగానే స్తంభానికి ఒక రంధ్రం పడింది.లోపల ఏదో దాగి ఉందని గ్రహించిన ఆ వ్యక్తి మరింత ఉత్సాహంగా స్తంభాన్ని పగలగొట్టడం కొనసాగించాడు.మొదట ఒక చిన్న సంచి బయటకు తీశాడు.
తర్వాత మరో వస్తువు కనిపించడంతో గోడను మరింత బలంగా కొట్టడం మొదలుపెట్టాడు.చివరికి ఒక ఇటుకను తొలగించి లోపలి నుంచి ఒక లోహపు కప్పును బయటకు లాగాడు.
ఆ కప్పులోపల పాతకాలపు కరెన్సీ నోట్ల కట్టలు కనిపించాయి.ఆ నిధి చూస్తుంటే చాలా విలువైనదిగా అనిపిస్తోంది.
ఈ వీడియోను జాక్ చార్లెస్( Jack Charles ) (@jackcharlesefaisca) అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ “గోడలో అతను వెలకట్టలేని నిధిని కనుగొన్నాడు” అనే క్యాప్షన్‌తో షేర్ చేశాడు.అయితే, ఈ వీడియో నిజమా లేదా కల్పితమా అనేది తెలియాల్సి ఉంది.వీడియో క్రియేటర్ తనను తాను ఒక కళాకారుడిగా చెప్పుకుంటున్నాడు.బహుశా ఇది కేవలం వినోదం కోసం చేసి ఉండొచ్చని కొందరు అనుకుంటున్నారు.ఏదేమైనా ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.ఇప్పటికే 68 లక్షల వ్యూస్‌ను, లక్షకు పైగా లైక్స్‌ను సొంతం చేసుకుంది.
వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నార.ఒక యూజర్ “నేనైతే అల్లావుద్దీన్ కథలో జిన్నులాగా ఏదో ఒకటి వస్తుందని అనుకున్నా” అంటూ సరదాగా కామెంట్ చేశారు.
ఇంకొందరు మాత్రం ఇది నిజంగా జరిగిందా లేదా పబ్లిసిటీ కోసం క్రియేట్ చేశారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ వైరల్ వీడియో పై మీరు కూడా ఓ లుక్ వేయండి.