ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక వేడుకల్లో ఒకటైన మహా కుంభమేళా, కోట్లాది భక్తులను ఆకర్షిస్తుంటుంది.కానీ, టీమ్‌ఇండియా క్రికెటర్లు కూడా ఈ ఆధ్యాత్మిక వేడుకను సందర్శించారనే ఫొటోలు ఇప్పుడు నెటిజన్లలో చర్చనీయాంశంగా మారాయి.
అయితే, ఈ ఫొటోలు నిజం కాదు.కృత్రిమ మేధస్సు ( Artificial Intelligence ) సాయంతో సృష్టించబడినవి.
టీమ్‌ఇండియా మద్దతుదారుల బృందం ‘ది భారత్ ఆర్మీ’ ( The Bharat Army )ఈ ఫొటోలను ఏఐ సహాయంతో రూపొందించి.క్రికెటర్లు మహా కుంభమేళాకు వెళితే అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.ఈ ఫొటోల్లో టీమ్‌ఇండియా క్రికెటర్లు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ తదితరులు కాషాయ దుస్తుల్లో కనిపిస్తున్నారు.
వారు మహా కుంభమేళాలో పాల్గొన్నట్లుగా ఈ చిత్రాలను అత్యంత సహజంగా రూపొందించారు.
ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు.టీమ్‌ఇండియా క్రికెటర్లను భిన్న రూపంలో చూడడం అందరినీ ఆకట్టుకుంది.అయితే, ఇది కేవలం ఏఐ క్రియేటివిటీ అని తెలుసుకున్న తర్వాత కూడా ఈ ఫొటోలు వినోదాన్ని కలిగిస్తున్నాయి.
జనరేటివ్ ఏఐ సాంకేతికత తాజాగా చిత్రాలు, వీడియోలు రూపొందించడంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది.ఇది రియలిస్టిక్ ఫొటోలను సృష్టించడం ద్వారా సృజనాత్మకతకు కొత్తదారులు తెరిచింది.కానీ, ఈ విధమైన చిత్రాలు కేవలం వినోదం కోసం మాత్రమే ఉపయోగించాలని, తప్పుగా ఉపయోగిస్తే గందరగోళానికి దారితీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇంకెందుకు ఆలశ్యం ఈ ఫోటోలను చుసిన మీకు ఎఅనిపించిందో ఓ కామెంట్ రూపంలో తెలపండి.