టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న రాజమౌళి ( Rajamouli ) ప్రస్తుతం మహేష్ బాబుతో( Mahesh Babu ) సినిమా చేయబోతున్న విషయం మనకు తెలిసిందే.ఈ సినిమా ఏడాది పాటు ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకున్నారు.
ఇటీవల పూజా కార్యక్రమాలను కూడా ఎంతో ఘనంగా పూర్తి చేసుకున్నారు.కానీ ఈ పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఒక ఫోటోని కూడా రాజమౌళి బయటకు విడుదల చేయలేదు.
అంతేకాకుండా మహేష్ బాబు కూడా బయట కనిపించడంతో చాలామంది అభిమానులు అసలు ఈ సినిమా షూటింగ్ జరుగుతోందా లేదా అనే సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.
ఇలా ఈ సినిమా షూటింగ్ విషయంలో సందేహాలను వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమా గురించి రాజమౌళి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.రాజమౌళి ఏ చిన్న పోస్ట్ చేసిన అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుందనే విషయం మనకు తెలిసిందే.అయితే తాజాగా ఈయన ఒక చిన్న వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఈ వీడియోలో భాగంగా ఒక సింహాన్ని జైల్లో బంధించి ఆ సింహం ముందు పాస్ పోర్ట్( Pass Port ) చేతిలో పట్టుకొని రాజమౌళి కనిపించినటువంటి వీడియోని విడుదల చేశారు.ఇక ఈ వీడియోకి క్యాప్చర్డ్ అనే క్యాప్షన్ ఇచ్చారు.
ఇలా పాస్ పోర్ట్ చేతిలో పట్టుకొని రాజమౌళి అలాంటి క్యాప్షన్ ఇవ్వడంతో కచ్చితంగా ఇది మహేష్ బాబు పాస్ పోర్ట్ అని ఆయన పాస్ పోర్ట్ రాజమౌళి సీజ్ చేశారని తెలుస్తోంది.ఇక రాజమౌళి చేసిన ఈ పోస్ట్ పై నాటి ప్రియాంక చోప్రా( Priyanka Chopra ) స్పందిస్తూ ఫైనల్లీ అంటూ కామెంట్ చేశారు.ఇక కాసేపటికి మహేష్ బాబు కూడా ఈ పోస్ట్ పై స్పందిస్తూ ఊహించని విధంగా రిప్లై ఇచ్చారు.ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ పోకిరి సినిమాలోని డైలాగు ద్వారా రిప్లై ఇచ్చారు.
ఇక మహేష్ బాబు ఏమాత్రం విరామం దొరికిన తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెకేషన్ వెళ్తూ ఉంటారు.ఇకపై వెళ్లే అవకాశం లేదని మహేష్ బాబుని తన కస్టడీలో బంధించేశాననీ రాజమౌళి చెప్పకనే చెప్పేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.