ప్రముఖ బుల్లితెర నటి చవీ మిట్టల్( Actress Chavi Mittal ) గురించి మనందరికీ తెలిసిందే.బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటించి నటిగా మంచి గుర్తింపును ఏర్పరచుకుంది.
అయితే క్యాన్సర్ కారణంగా ఆమె గత కొంతకాలంగా బాధపడుతున్న విషయం తెలిసిందే.క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది.
అయితే క్యాన్సర్( Cancer ) తో పోరాడుతున్న తనపై కొందరు మానవత్వం లేకుండా అలాంటి కామెంట్లు చేస్తున్నారు అంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ను కూడా చేసింది.
క్యాన్సర్ చికిత్స వల్ల జుట్టు కోల్పోతున్న తనపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.ఈ మేరకు ఆమె తన ఇంస్టాగ్రామ్ లో ఈ విధంగా రాసుకొచ్చింది.“మానవత్వం చచ్చిపోతే ఎలా ఉంటుందో ఈ రోజు మరోసారి చూశాను.క్యాన్సర్ చికిత్స వల్ల నేను జుట్టు కోల్పోతుంటే మీరేమో ట్రోల్ చేస్తున్నారు.2022 నుంచి రొమ్ము క్యాన్సర్ తో పోరాడుతున్నాను.దీనికి పదేళ్ల పాటు ట్రీట్‌మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ ఏడాది ఏప్రిల్ తో నా హార్మోన్ చికిత్సకు మూడేళ్లవుతాయి. ఈ ట్రీట్‌మెంట్ వల్ల ఎన్నో దుష్ప్రభావాలు ఉన్నాయి.
చర్మం పొడిబారడం, డీహైడ్రేషన్, బరువు( Dryness, dehydration, weight ) సరిగా లేకపోవడం, మూడ్ స్వింగ్స్, తిమ్మిర్లు ఇలా వీటన్నింటితో పాటు జుట్టు కూడా ఊడిపోతుంది.అమ్మాయిలకు జుట్టు అంటే ఎంతిష్టమో నేను మాటల్లో చెప్పలేను.మొదటగా అమ్మతనానికి అవసరమైన రొమ్ము నిలుపుకోవడానికి పోరాడాను.ఇప్పుడు జుట్టు కోసం! ఇలాంటి సమయంలో మీరు చేసే నెగెటివ్ కామెంట్లు నన్ను మరింత కుంగదీస్తున్నాయి.ఇప్పుడు ఈ పోస్ట్ పెట్టడానికి ప్రధాన కారణం కొందరు నన్ను ఇష్టపడి నా అకౌంట్ ఫాలో అవడం లేదు.కేవలం ట్రోల్ చేయడానికే ఫాలో అవుతున్నారు.
జుట్టు రాలిపోతున్న క్యాన్సర్ వారియర్ ను ట్రోల్ చేయడానికి మీ మనసెలా అంగీకరించిందో అర్థం కావట్లేదు.మీకు తలనిండా వెంట్రుకలు, క్యాన్సర్ లేని జీవితం, నీచమైన విమర్శలు లేని జీవితం ఉండాలని ఆశిస్తున్నాను.
అలాగే నేను నా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా, కష్టపడి నా శరీరాన్ని ఫిట్‌గా ఎలా ఉంచుకున్నానో చూడు అని రాసుకొచ్చింది.ఈ సందర్భంగా ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెగిటివ్ కామెంట్స్ చేసే వారి గురించి పట్టించుకోకండి బీ స్ట్రాంగ్, అలాంటివారు మామూలే ట్రోల్స్ చేస్తారు మీరు పట్టించుకోకండి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.