సాధారణంగా కొందరి స్కిన్( Skin ) అనేది చాలా ఆయిలీ గా ఉంటుంది.ఎన్నిసార్లు ఫేస్ వాష్ చేసుకున్న కూడా మళ్లీ కొద్దిసేపటికి జిడ్డు జిడ్డుగా మారిపోతుంటుంది.
పైగా ఆయిలీ స్కిన్ వల్ల చర్మ పై దుమ్ము ధూళి పేరుకుపోయి మొటిమలు కూడా ఎక్కువగా వస్తుంటాయి.మీరు కూడా జిడ్డుగల చర్మంతో ఇబ్బంది పడుతున్నారా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.ఇప్పుడు చెప్పబోయే రెమెడీ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ రెమెడీ చర్మంపై అదనపు నూనెను గ్రహిస్తుంది, ముఖాన్ని తాజాగా మరియు కాంతివంతంగా మెరిపిస్తుంది.అదే సమయంలో మరెన్నో స్కిన్ కేర్ బెనిఫిట్స్ ను కూడా మీ సొంతం చేస్తుంది.

అందుకోసం ముందుగా ఒక చిన్న టమాటోను( Tomato ) తీసుకొని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్( Corn flour ), వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్( Coffee powder ), వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.చివరకు సరిపడా టమాటో ప్యూరీ కూడా వేసుకుని కలుపుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

రెండు రోజులకు ఒకసారి ఈ సింపుల్ రెమెడీని పాటించడం వల్ల చర్మంపై చనిపోయిన చర్మ కణాలు మరియు మలినాలు తొలగిపోతాయి.కార్న్ ఫ్లోర్ స్కిన్ పై ఉన్న ఎక్సెస్ ఆయిల్ ను రిమూవ్ చేస్తుంది.స్కిన్ ను ఎక్కువ సమయం పాటు ఫ్రెష్ గా గ్లోయింగ్ గా ఉంచుతుంది.
అలాగే టమాటో చర్మం పై రంధ్రాల రూపాన్ని తగ్గించి మొటిమల సమస్యకు అడ్డుకట్ట వేస్తుంది.మొండి మచ్చలను క్రమంగా మాయం చేస్తుంది.కాఫీలోని కెఫిన్ రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది, ఇది మీ చర్మాన్ని బిగుతుగా ఉంచడంలో సహాయపడుతుంది.తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడుతుంది.
మరియు తేనె చర్మాన్ని ఆరోగ్యంగా ప్రకాశవంతంగా మారుస్తుంది.