సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) రాజకీయాలలోకి అడుగుపెట్టి రాజకీయాలలో కూడా ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ నేడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా( AP Deputy CM ) బాధ్యతలు తీసుకున్నారు.ఇలా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతూ రాజకీయాలలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.
ఇక పవన్ కళ్యాణ్ కేవలం రాష్ట్రస్థాయిలో మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలో కూడా నాయకుడిగా గుర్తింపు పొందారు.అయితే కొంతమంది మాత్రం పవన్ కళ్యాణ్ విజయాన్ని స్వాగతించలేకపోతున్నారు.

తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి( Vijayasai Reddy ) రాజకీయాలకు రాజీనామా చేసిన సంగతి మనకు తెలిసిందే.అయితే విజయసాయిరెడ్డి పవన్ కల్యాణ్ దెబ్బకే ఇలా చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.ఈ అంశంపై ఓ యూట్యూబ్ చానల్ తో మాట్లాడిన సీనియర్ నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు( Tripuraneni Chitti Babu ) పవన్ కళ్యాణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తారు.పవన్ దెబ్బకు విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం ఏంటి…అసలు ప్రతీ దాన్ని పవన్ తో ఎందుకు ముడిపెడుతున్నారని ప్రశ్నించారు.

ఇందులో పవన్ దెబ్బ ఏముంది లోకేష్ దెబ్బకు పవన్ కళ్యాణ్ గిలగిల్లాడతారో తెలియదన్నారు.లోకేష్, జగన్ మధ్య పవన్ ఎలా నగిలిపోతారోనన్నారు.పవన్ కళ్యాణ్ ఈరోజు మాట్లాడింది రేపు మాట్లాడరు.ఆయన రోజుకు ఒక మాట మాట్లాడుతూ ఉంటారు పవన్ కళ్యాణ్ ఒక పొలిటికల్ జోకర్ అని నిర్మాత చిట్టిబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇప్పుడు ఆయన పవర్ లో ఉన్నారు కాబట్టి పవర్ ఫుల్ జోకర్ అంటూ పవన్ కళ్యాణ్ గురించి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.క్షమాపణలు చెప్పాలని.సీజ్ ది షిప్ అంటూ అప్పటికే సీజ్ చేసిన షిప్ లను అనడం, ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ పవన్ కళ్యాణ్ జోకర్ అవుతున్నారు అంటూ చిట్టి బాబు చేసిన ఈ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి ఈయన చేసిన వ్యాఖ్యలపై పవన్ ఫాన్స్ ఫైర్ అవుతున్నారు.







