Homemade Anti Acid Serum : మొటిమలతో చింతేలా.. ఈ హోం మేడ్ సీరం తో తరిమి కొట్టండి!

మొటిమలు.యుక్త వయసు ప్రారంభం అయ్యిందంటే చాలు పనిగట్టుకుని మరీ వచ్చి మదన పెడుతుంటాయి.

 Homemade Anti Acne Serum For You , Homemade Serum, Anti Acne Serum, Acne, Skin-TeluguStop.com

హార్మోన్ చేంజ్, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, కంటి నిండా నిద్ర లేకపోవడం, చర్మంపై మృత కణాలు పేరుకుపోవడం తదితర కారణాల వల్ల మొటిమలు తరచు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.దాంతో వాటిని నివారించుకోవడం కోసం విశ్వ ప్ర‌యత్నాలు చేస్తుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్సలు చింతించకండి.

ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ సీరం ను వాడితే కనుక మొటిమలను చాలా సులభంగా మరియు వేగంగా తరిమికొట్టొచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సీరం ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ ను పోసుకోవాలి.వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో గుప్పెడు గులాబీ రేకులు, గుప్పెడు మందార పువ్వు రేకులు వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ సోంపు గింజలు, వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి కనీసం ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.అనంతరం స్టవ్ ఆఫ్ చేసి ఉడికించిన మిశ్రమం నుండి వాటర్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ వాటర్ లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ వేసుకుని అన్నీ కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటే మన సీరం సిద్ధమవుతుంది.

Telugu Acne, Acne Serum, Tips, Homemade Serum, Latest, Skin Care, Skin Care Tips

ఈ సీరం ను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు ఈ సీరంను మొటిమలపైనే కాకుండా ముఖం మొత్తానికి అప్లై చేసుకుని నిద్రించాలి.ఈ సీరం ను ప్రతిరోజు గనుక వాడితే మొటిమలు మరియు వాటి తాలూకు మచ్చల నుంచి చాలా త్వరగా ఉపశమనం లభిస్తుంది.

అలాగే ఈ సీరం ను వాడటం వల్ల చర్మ ఛాయ మెరుగుపడుతుంది.వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా సైతం ఉంటాయి.కాబట్టి తప్పకుండా ఈ హోమ్ మేడ్‌ సీరంను వాడేందుకు ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube