తండేల్ సినిమాకు హైలెట్ సీన్లు ఇవేనా.. నాగచైతన్య కెరీర్ బెస్ట్ మూవీగా నిలవనుందా?

నాగచైతన్య( Naga Chaitanya ) సాయి పల్లవి( Sai Pallavi ) జంటగా నటిస్తున్న చిత్రం తండేల్.( Thandel ) ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు అప్డేట్లు విడుదలైన విషయం తెలిసిందే.ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.శ్రీకాకుళం మత్స్యకారుల నేపథ్యంలో ఈ కథను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా నిర్మాత బన్నీ వాసు( Producer Bunny Vasu ) ఈ సినిమా గురించి మాట్లాడుతూ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశారు.

 Naga Chaitanya Sai Pallavi Thandel Highlight Scenes Details, Thandel, Tandel Mov-TeluguStop.com

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.ఈ సినిమా జస్ట్ లవ్ స్టోరీ మాత్రమే కాదు.

శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుల జంట కథను తీసుకున్న అల్లిన కథ మాత్రమే కాదు అంతకుమించి ఉండబోతోంది.

Telugu Bunnyvasu, Chandoo Mondeti, Nagachaitanya, Bunny Vasu, Sai Pallavi, Tande

అంతంత మాత్రం చదువుకున్న మత్స్యకారుల్లో నిగూఢంగా దాగిన దేశభక్తి కూడా దాగి ఉంటుంది.అలాగే ఆర్టికల్ 360 రద్దు తరువాత కరాచీలో జరిగిన కొన్ని దారుణమైన సంఘటనలను ఈ సినిమాలో చూపిస్తారు.అయితే ఆ సంఘటనలు ఏమిటి అన్నది వెల్లడించలేను, సినిమాలో చూడాల్సిందే అని అన్నారు బన్నీ వాసు.

పాక్ జైలులో మగ్గే మత్స్యకార ఖైదీలు తాము రాసే ఉత్తరాల చివన్న జైహింద్ అని అస్సలు భయం లేకుండా ఇంగ్లీష్ లో రాసేవారని తెలిసి తాను, దర్శకుడు చందు మొండేటి( Director Chandoo Mondeti ) ఆశ్చర్యపోయామని అన్నారు.అదే సమయంలో మన ఖైదీలను ఏ విధంగా హింసించారో తెలిసిన తరువాత గుండె బాధతో బరువెక్కిందని అన్నారు.

ఈ సినిమా ప్రతి ఒక్కరికీ ప్రత్యేకం అని హీరో చైతన్య ఈ సినిమా కోసం చాలా అంటే చాలా కష్టపడ్డారని, గంటల తరబడి ఎండలో నిల్చుని స్కిన్ టోన్ మారడం కోసం ప్రయత్నించారని ఆయన తెలిపరు.

Telugu Bunnyvasu, Chandoo Mondeti, Nagachaitanya, Bunny Vasu, Sai Pallavi, Tande

సాయి పల్లవి కొన్ని సెకండ్ల పాటు ఆగకుండా చేసిన డ్యాన్స్ అలరిస్తుందని ఆయన అన్నారు.హీరో అక్కడ హీరోయిన్ ఇక్కడ అనే ఫీల్ లేకుండా ఇద్దరూ కలిసే వున్నారనే ఫీల్ వచ్చేలా సినిమా చిత్రీకరణ వుంటుందని అన్నారు బన్నీ వాసు.ఇంటర్వెల్ బ్యాంగ్ చిత్రీకరణకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి.

వాటిని అధిగమించి చిత్రీకరించాము.సినిమాలో శివతాండవం పాట కొన్నాళ్ల పాటు నిలిచిపోతుంది.

సినిమాలో సిజి వర్క్స్ వున్నా, వీలయినంత వరకు ఒరిజినల్ సీన్లు చిత్రీకరించడానికే ట్రయ్ చేసాము.మంగుళూరు దగ్గర సముద్రం మీద వీటిని రియలిస్టిక్ గా రియల్ గా చిత్రీకరించాము.

సినిమాకు తొంభై కోట్ల వరకు ఖర్చు చేసామని నాన్ థియేటర్ ఆదాయం యాభై కోట్ల వరకు వచ్చింది.మరో నలభై కోట్ల వరకు థియేటర్ నుంచి రాబట్టగలమన్న నమ్మకం వుందని బన్నీవాస్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube