తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాల్లో ఎల్లమ్మ, పోచమ్మ ఆలయాలు ఉన్నాయి.అయితే హైదరాబాద్లో బల్కంపేటలోని ఎల్లమ్మ ఆలయం ( Yellamma )మాత్రం చాలా ఫేమస్.
దశాబ్దాలు ఈ ఆలయం ఆలయాల్లో ఒకటిగా వెలుగుతుంది.అయితే అక్కడ ఎల్లమ్మ ఎలా వెలిసింది? ఈ దేవాలయం ప్రాశస్త్యం ఏమిటి? అనే విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.బల్కంపేట ఎల్లమ్మ తల్లి గురించి ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి.కలియుగ దైవంగా ఎల్లమ్మను ఎప్పుడు కొలుస్తూ ఉంటారు.అయితే పరశురాముల తల్లి రేణుకాదేవి అవతారమే ఎల్లమ్మ తల్లిగా కొలుస్తారు.ఇక బాలత్రిపుర సుందరిగా కూడా ఈ ఎల్లమ్మను భావిస్తూ ఉంటారు.

ఇక మరికొందరేమో ఎల్లమ్మను బాలాంబికగా ( Balkampet Yellamma )పిలుస్తూ ఉంటారు.ఇక రాను రాను బాలాంబికగా తల్లి కొలువైన ప్రాంతం బల్కమ్మపేట గాను ఆ తర్వాత బల్కంపేట గా మారిపోయింది.బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం వెనుక భాగంలో ఉన్న బావికి చాలా విశిష్టత ఉంది.అయితే అక్కడ నీటిని భక్తులు తీర్థంగా భావిస్తూ ఉంటారు.ఆ బావిలో ఉన్న నీరు తాగితే సర్వరోగాల నుండి విముక్తి పొందవచ్చు అని భక్తులు నమ్ముతారు.అయితే ఏడు దశాబ్దాల కిందటే ఈ బావి ఉందని గతంలో ఈ భావి మధ్యలో అమ్మవారు ఉండేవారని పురాణాల ద్వారా తెలుస్తోంది.

ఈ బావి నీటి మధ్యలో అమ్మవారు కొలువై ఉండడం వలన ఆ గతంలో దూరం నుండి అమ్మవారిని దర్శించుకునే వారు.బల్కంపేట ఎల్లమ్మ బావిలో 10 అడుగుల లోతున శయానా రూపంలో ఉంది.అలాగే బావి పైభాగంలో మహా మండపంలో అఖండ జ్యోతి నిత్యం వెలుగుతూనే ఉంటుంది.ఇక ప్రతి ఏటా అమ్మవారి ఆలయాన్ని వేల మంది భక్తు( Devotees )లు ఎక్కడినుండో వస్తు దర్శించుకుంటూ ఉంటారు.
మహారాష్ట్ర, చత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి కూడా చాలా మంది భక్తులు అక్కడికి వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు.ఇక ఆలయం పక్కనే అమ్మవారి రూపంతో విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు.
దీంతో భక్తులు ఏటా బోనాలు కూడా సమర్పిస్తూ ఉంటారు.దీంతో బోనాల ఎల్లమ్మగా ప్రసిద్ధి చెందింది.
DEVOTIONAL







